రతన్ టాటా ఆ టైంలో నాకు సలహాలిచ్చేవారు : బ్రిటన్ మాజీ ప్రధాని

-

భారత్ విషయంలో పశ్చిమ దేశాల అభిప్రాయ ధోరణి క్రమంగా మారుతోందని బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కమెరూన్ తెలిపారు. చంద్రుడి దక్షిణ పోల్‌లో రోవర్‌ను దించిన చంద్రయాన్ 3 సహా అనేక అంశాల వల్ల భారత్‌పై పశ్చిమ దేశాల దృష్టి కోణం మారిందన్నారు. జాగ్వార్‌ను టాటా కొనడంలో బ్రిటన్‌లో జపాన్ పెట్టుబడుల్ని భారత్ దాటేసిందని తెలిపారు.

‘టాటా పెట్టుబడి నాకో వేకప్ కాల్. ప్రపంచస్థాయికి భారత ఎకానమీ ఎదిగిందని, గొప్ప పనులు చేయబోతుందని గ్రహించాను. నేను పీఎంగా ఉన్నప్పుడు రతన్ టాటా నాకు సలహాదారుడిగా ఉండేవారు’ అని వెల్లడించారు. ఇదిలాఉండగా, బ్రిటన్ మాజీ ప్రధాని కమెరూన్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. టాటా గొప్పతనం నుంచి బ్రిటన్ మాజీ ప్రధాని కొనియాడటంపై నెట్టింట చర్చ జరుగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version