రేవంత్ రీస్టార్ట్..స్టామినా చూపిస్తారా?

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పైకి లేపేందుకు పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నానా కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే…ఓ వైపు అధికార టీఆర్ఎస్ దూకుడు, మరో  వైపు కాంగ్రెస్‌ని డామినేట్ చేసేలా బీజేపీ పుంజుకోవడం లాంటివి రేవంత్‌కు బాగా ఇబ్బందికరంగా మారాయి..అయినా సరే ఏదొరకంగా పార్టీని నిలబెడదాం అనుకుంటే…సొంత పార్టీ నేతలతో తలనొప్పులు ఎక్కువైపోయాయి..పార్టీని పైకి తీసుకెళ్దాం అని రేవంత్ చూస్తుంటే…కాంగ్రెస్ నేతలు ఏమో కాళ్ళు పట్టుకుని కిందకు లాగే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో ఇంకా కాంగ్రెస్ పార్టీ కష్టాలు పోలేదు…అయితే రేవంత్ పి‌సి‌సి అయిన మొదట్లో భారీ బహిరంగ సభలు పెట్టి పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చారు…దళితర-గిరిజన ఆత్మగౌరవ పేరిట భారీ సభలు పెట్టి తెలంగాణ ప్రజల దృష్టిని కాంగ్రెస్‌పై పడేలా చేశారు..అలాగే నిరుద్యోగుల కోసం తీవ్ర స్థాయిలో పోరాటాలు చేశారు..జంగ్ సైరన్ పేరిట సభలు పెట్టి సక్సెస్ అయ్యారు.

ఇక ఆ సభలతో రేవంత్ మళ్ళీ భారీ సభలు పెట్టలేదు…ఎంతసేపు సొంత పార్టీలో ఉన్న లుకలుకలపైనే దృష్టి పెట్టాల్సిన పరిస్తితి వచ్చింది..అయితే పార్టీ నాయకులు ఎలాంటి రచ్చ చేసిన సరే రేవంత్ మళ్ళీ రీస్టార్ట్ అవ్వనున్నారు…మరొకసారి సభలతో ప్రజల మధ్యలోకి వెళ్లడానికి రేవంత్ సిద్ధమవుతున్నారు. మీడియాతో మాట్లాడితే ఏదో కొంతవరకే చూస్తారు..రూరల్ లెవెల్‌లో ఉన్న ప్రజలకు రీచ్ అవ్వదు..అదే ఎక్కడకక్కడే సభలు పెట్టుకుంటూ వెళితే ప్రజలకు చేరువతారు.

అందుకే ఇప్పుడు రేవంత్ అదే ప్లాన్‌లో ఉన్నారు.. ఇప్పటికే మన ఊరు-మన పోరు  పేరిట సభలు నిర్వహించాలని రేవంత్ సిద్ధమయ్యారు. అతి త్వరలోనే పరిగి, వేములవాడ, కొల్లాపూర్‌లలో సభలు నిర్వహించనున్నారు. ఈ సభలు ద్వారా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు, కేసీఆర్ ప్రభుత్వం అవినీతి అంశాలని హైలైట్ చేయాలని రేవంత్ చూస్తున్నారు. అలాగే ఈ సభలు ద్వారా స్థానిక సమస్యలపై ప్రజా పోరాటాలు చేయాలని నిర్ణయించారు. ఈ విధంగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news