RC 15:రిలీజ్ డేట్ విషయంలో దిల్ రాజుకు, శంకర్ కు గ్యాప్.!

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకొని ఆ తర్వాత ఆచార్యతో ప్లాప్ మూట గట్టుకున్నాడు.  అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరు కూడా ఎక్కువగా శంకర్ సినిమా పైన ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు కూడా ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ కేటాయించి పనిచేస్తున్నాడట.

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ సినిమా కాబట్టి ఇప్పుడు ఈ సినిమా పై భారీ హైప్ నెలకొని ఉంది. అయితే ఈ సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్ కోసం దర్శక నిర్మాతలు భారీగా ఖర్చుపెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. అలానే శంకర్ ఈ సినిమాలో ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీన్ ను కూడా ప్లాన్ చేశారట. కేవలం ఈ ఒక్క సన్నివేశం కోసమే నిర్మాతలు 10 కోట్ల వరకు ఖర్చు చేసిన్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా ఇప్పటికీ గందర గోళం నెలకొంది. దిల్ రాజు ఈ సినిమా ను సంక్రాంతికి రిలీజ్ చేయాలని పట్టుదల తో ఉంటే శంకర్ మాత్రం టైమ్ సరిపోదని వేసవి కాలంలో రిలీజ్ చేయాలని కోరారట. దీనితో ఇద్దరి మధ్య చిన్న గ్యాప్ వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు.ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులు తో పాటు మిగిలిన ప్యాన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version