తిరుమల శ్రీవారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దేశంలోనే అత్యంత ధనవంతుడు మన శ్రీవారు. నిత్యం భక్తులతో శ్రీవారి ఆలయం కలకలలాడుతూ ఉంటుంది. ప్రతిరోజు 50 వేలకు పైగానే శ్రీవారిని దర్శించుకుంటారు. అలాగే ఆయన ఉండి ఆదాయం నిత్యం కోట్లలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం… రికార్డు సృష్టించింది.
ఆదివారం రోజున శ్రీవారి హుండీ ఆదాయం 6.31 కోట్ల రూపాయలు దాటింది. చరిత్రలో మొట్టమొదటిసారిగా 6.31 కోట్ల మార్కును దాటింది శ్రీవారి హుండీ ఆదాయం. ఇప్పటివరకు 2022 జులై 4 న శ్రీవారి హుండీ ఆదాయం 6.18 కోట్ల రూపాయలు దాటింది. 2012 ఏప్రిల్ ఒకటో తేదీన…5.73 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయమే అత్యధికం. ఇక తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పట్టింది. నిన్న స్వామివారిని 80,565 మంది భక్తులు దర్శించుకోగా, 31,608 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.