రీల్స్ చేసే వారికి తెలంగాణ సర్కార్‌ గుడ్ న్యూస్

-

తెలంగాణ రాష్ట్ర పోలీసులు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. జూన్ 26 న అంతర్జాతీయ మాదకద్రవ్యాలు మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్బంగ ఓ షార్ట్ వీడియో కాంటెస్ట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ‘డ్రగ్స్ అండ్ ఇట్స్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ’ పేరుతో ఈ పోటీ జరిగించనున్నారు. 18 ఏళ్ల వయస్సు నుండి పైబడిన వారు ఇందులో పాలుగోనే ఆవకాశం కలిపించింది సర్కార్.

Evening brief: KCR's office says he's unwell as Telangana CM skips PM Modi  event | Latest News India - Hindustan Times

‘డ్రగ్స్ వాడకం సమాజంపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతుంది.. దాని వల్ల కలిగే హానికరమైన ప్రభావాలు, ఆ వ్యక్తుల కుటుంబసభ్యులు పడే బాధలను కళ్ళకు కట్టినట్లు ఈ రీల్స్ ద్వారా చూపించాల్సి ఉంటుంది. మూడు నిమిషాల వ్యవధిలో ఈ యొక్క షార్ట్ వీడియో ని రూపొందించాలి. ఆ వీడియోలను జూన్ 20, 2023లోపు సబ్మిట్ చెయ్యాలి. ఈ పోటీలో నెగ్గిన వారికి నిలిచిన పురస్కారాలు అందజేయబడతాయి. మొదటి స్థానంలో నిలిచిన విజేతకు రూ. 75,000, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 50,000 మరియు ముడా స్థానంలో నిలిచిన వారికి రూ. 30,000 నిలిచిన బహుమతి లభిస్తుంది. ఈ పోటీలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వారు మరింత సమాచారం కోసం 96523 94751 నంబర్‌ ను సంప్రదించాలి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news