నేను కరుడు గట్టిన BRS కార్యకర్తను..నన్ను కొనలేరు – రేగా కాంతారావు

-

నేను కరుడు గట్టిన BRS కార్యకర్తను..నన్ను కొనలేరు అని టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. నిన్న రాత్రి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి బిగ్ స్కెచ్ వేసింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ శివారు మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో నలుగురు వ్యక్తులు భారీగా నగదుతో పట్టుబడ్డారు.

రామచంద్రభారతి, సోమయాజులు స్వామి, తిరుపతి, నందకుమార్ లను పోలీసులు పూర్తి సాక్షాలతో పట్టుకున్నారు. అయితే..ఈ ఎపిసోడ్‌పై టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పందించారు. బాధ్యత కలిగిన భారత పౌరునిగా క్రమశిక్షణ కలిగిన BRS కార్యకర్తగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకు నాకు పార్టీ అప్పజెప్పిన పని విజయవంతం చేశా కార్యకర్తలు గర్వపడండంటూ రేగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version