5G సేవలపై రిలయన్స్ జియో కీలక నిర్ణయం

-

ప్రస్తుతం భారతదేశం సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం దేశంలో 4జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆయా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు 5జీ సేవలపై ట్రయల్స్ కూడా నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి భారతదేశంలో 5జీ టెక్నాలజీ సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. టెలికాం కంపెనీలైన నోకియా, ఎరిక్సన్ వంటి 5జీ మాన్యుఫాక్చరింగ్ కంపెనీల భాగస్వామ్యంతో మొబైల్ టవరర్లను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు సంస్థలు వెల్లడించాయి.

5జీ సేవలు
5జీ సేవలు

ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో తన ప్రస్తుత 4జీ భాగస్వామి శాంసంగ్‌ను మించి 5జీ టెలికాం గ్రేస్‌లను కొనుగోలు చేయడానికి యూరోపియన్ టెలికాం గేర్ తయారీ కంపెనీ ఎరిక్సన్‌తో చర్చలు నిర్వహించింది. టెలికాం గేర్ తయారీదారులైన ఎరిక్సన్, నోకియాతో చర్చలు ప్రారంభించినట్లు బిజినెస్ స్టాండర్డ్ నివేదిక వెలువరించింది. దీంతో ఢిల్లీలో 5జీ ట్రయల్స్ కోసం టైఅప్ అయింది. ముంబైలో ట్రయల్స్ నిర్వహించడానికి 5జీ జియో సేవలకు ప్రభుత్వం అనుమతులు పొందింది.

Read more RELATED
Recommended to you

Latest news