తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు అవసరం – అన్నా మలై

-

తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు అవసరమని పేర్కొన్నారు తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అన్నా మలై. నిజామాబాద్ జిల్లా బీజీపీ కార్యాలయం లో ప్రెస్ మీట్ నిర్వహించారు అన్నా మలై. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ లో పార్టీ బలంగా ఉందని.. తెలంగాణ లోని ప్రాజెక్టులు కేసీఆర్ ఫ్యామిలీ కి ఏటీఎం గా మారాయని ఆగ్రహించారు.

ఉద్యమ స్ఫూర్తి 8 ఏళ్ల లో కోల్పోయిందని.. నీళ్లు నిధులు , నియామకాల విషయం లో విఫలమైందని విమర్శలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఆపీసు కు వెళ్లరు , క్యాబినెట్ మీటింగ్ పెట్టరని మండిపడ్డారు.

ముగ్గురి చేతుల్లో రాష్ట్రం నడుస్తుందని.. ఇక్కడి ముఖ్యమంత్రి కనీసం ప్రధాని మోడీ కి స్వాగతం పలకలేదని పేర్కొన్నారు. తెలంగాణ లో డబుల్ ఇంజన్ సర్కారు అవసరమని.. నేను ఒక యాక్సిడెంటల్ పొలిటిషియన్ ను అని పేర్కొన్నారు. 9 సంవత్సరాలు ఐపీఎస్ గా ఉన్న తర్వాత వ్యవసాయం చేయాలనీ బయటికి వచ్చాను..నరేంద్ర మోడీ నాయకత్వానికి ఆకర్షితుణ్ణి అయ్యి పార్టీ లో చేరానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news