పులొచ్చింది మేక చచ్చింది – రివ్యూ

-

పులొచ్చింది మేక చచ్చింది – రివ్యూ

నటీనటులు – జయలలిత, చిత్రం శ్రీను, ఆనంద్ భారతి, గోవర్థన్ రెడ్డి, నిహారిక రెడ్డి, యోగి, వర్ష, మను, అ శేఖర్ యాదవ్, చందు, సుజిత్, శంకర్ తదితరులు

సాంకేతిక నిపుణులు – సంగీతం – సుభాష్ ఇషాన్, డైలాగ్స్ – నాత్మిక, సినిమాటోగ్రఫీ – కిరణ్ కుమార్ దీకొండ, ఎడిటర్ – శ్రీనివాస్ అన్నవరపు, నిర్మాత – భవానీ శంకర్ కొండోజు, రచన – దర్శకత్వం – అ శేఖర్ యాదవ్

కథేంటంటే

ఆస్ట్రేలియాలో స్థిరపడిన ఇండియన్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ గోవి (మను). ఇతని స్నేహితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పాండా (ఆనంద్ భారతి). నేరాల మీద పుస్తకం రాయాలనుకున్న పాండా, పుస్తకం రాసేందుకు ఒక పెద్ద క్రైమ్ గురించి గోవిని చెప్పమంటాడు. అలా గోవి కథ చెప్పడం ప్రారంభించడంతో సినిమా అసలు కథలోకి వెళ్తుంది. అదో అందమైన ఇళ్లు. ఆ ఇంట్లో నాన్న రాబర్ట్ (చిత్రం శ్రీను), అమ్మ అరుణ కుమారి ( నిహారిక ), పెద్ద కొడుకు వాసుదేవ్ (యోగి) కూతురు వైశాలి (వర్ష), చిన్న కొడుకు ఉంటారు. మిగిలిన నలుగురు కుటుంబ సభ్యులు చిన్న కొడుకును చంపాలని ఎవరికి వాళ్లు ప్రయత్నిస్తుంటారు. అమాయకుడైన ఆ కుర్రాడిని సొంత కుటుంబ సభ్యులే ఎందుకు చంపాలనుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఐపీఎస్ ఆఫీసర్ గోవికి ఈ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే

సాధారణంగా సినిమాలు మొదటి భాగం పూర్తయ్యాక సెకండాఫ్ మొదలవుతుంది. కానీ 360 డిగ్రీల స్క్రీన్ ప్లే కాబట్టి తొలి, ద్వితీయ భాగాల సినిమా ఒకేసారి ప్లే అవుతుంటుంది. శుభం కార్డుతో ప్రారంభమైన మొదటి సినిమా ఇదే కావొచ్చు. శుభం కార్డుతో మొదలై వెనక్కి వెళ్తుంది కథ. అలాగని స్క్రీన్ ప్లే అర్థం కానంత కన్ఫ్యూజన్ తో ఉండదు. కథ చాలా స్పష్టంగా అర్థమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకుడు అ శేఖర్ యాదవ్. మన చుట్టూ ఉండే కుటుంబాలు, ఆ కుటుంబాల్లోని సభ్యుల వ్యక్తిత్వాలు, వాళ్ల మానసిక బలహీనతలు ..ఇలా దారి తప్పిన ఓ సగటు కుటుంబాన్ని తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు.

సినిమాలోని సస్పెన్స్ ఒక సీన్ నుంచి మరో సీన్ కు కొనసాగింపుగా తీసుకెళ్లడంలో టెక్నికల్ అంశాలు బాగా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం ఈ ఉత్కంఠభరిత సన్నివేశాలను ప్రేక్షకులకు కనెక్ట్ చేశాయి. కెమెరా మూవ్ మెంట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లోని కొత్తదనంతో పాటు ఎడిటింగ్ లోని కలర్ టెక్చర్స్ పులొచ్చింది మేక సచ్చింది సినిమా సస్పెన్స్ క్రైమ్ డ్రామా ఫ్లేవర్ ను క్రియేట్ చేశాయి. కథకు సరిపోయేలా ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నాయి. సినిమా నిడివి కూడా రెండు గంటల లోపే కావడంతో సినిమా త్వరగా చూసేశాం అనే ఫీల్ కలిగిస్తుంది. సస్పెన్స్ క్రియేషన్ కోసం దర్శకుడు కొన్ని సీన్స్ ను స్లో మోషన్ లో చూపించాడు. ఈ సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే కథనంలో వేగం మరింత పెరిగి ఉండేది.

గోవి క్యారెక్టర్ లో మను పాత్రకు తగినట్లు నటించాడు. మంచి విలనీని చూపించాడు. అలాగే ఆనంద్ భారతి క్యారెక్టర్ చిన్నదే అయినా ఇంపాక్ట్ కలిగించింది. రాబర్ట్ గా చిత్రం శ్రీను చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించాడు. అతని నటనలో మొదట క్రూరత్వం తర్వాత పశ్చాతాపం వంటి భావోద్వేగాలు బాగా పలికాయి. అరుణ కుమారి క్యారెక్టర్ లో మెప్పించింది నిహారిక అలాగే వాసుదేవ్ గా యోగి, వైశాలిగా వర్ష బాగా పర్మార్స్ చేశారు. చిన్న చిత్రమే అయినా మంచి ప్రయత్నం చేశాడు దర్శకుడు అ శేఖర్ యాదవ్.

రేటింగ్ 3/5

Read more RELATED
Recommended to you

Exit mobile version