సీఎం జగన్‌పై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

-

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇతర పార్టీల్లో ఉన్న మాజీ టీడీపీ నేతలు, టీడీపీ సానుభూతి పరులు, అభిమానులు చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ఘాటుగా స్పందించారు. ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ఒక మూర్ఖుడిగా, మానసిక రోగిగా అభివర్ణించారు. అసలు జగన్ మోహన్ రెడ్డి ‘స్కిల్ డెవలప్ మెంట్’ కు ఎవరూ సరితూగరని ఎద్దేవా చేశారు రేణుకా చౌదరి. మోసాలు చేయడానికి, బాబాయ్ ని చంపుకోవడంలోనూ, తండ్రి శవం వద్ద సంతకాల కోసం ప్రయత్నించడంలోనూ ఆయన ‘స్కిల్’ అందరికీ తెలిసిందేనని వ్యంగ్యం ప్రదర్శించారు రేణుకా చౌదరి. అధికార దాహంతో జగన్ రొప్పుతున్నాడని, అతి త్వరలో అతడి మదం తగ్గుతుందని రేణుకా చౌదరి రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు.

“ఆ సీఐడీ పోలీస్ సంస్థ ఏంటండీ బాబూ… ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, ఎలాంటి లోపాలు లేకుండా అరెస్ట్ చేస్తారా? జగన్ ఒక మెంటల్ కేసు. రాజ్యాంగంలో ఒక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఐదేళ్లకు ఇలాంటి నాయకులకు మానసిక వైద్య పరీక్షలు చేసి, మానసికంగా సరిగ్గా ఉన్నారా లేదా అనేది నిర్ధారించాలి. ఇంతవరకు ఒక్క రాజధానే రాలేదు కానీ, మూడు రాజధానులు అని మాట్లాడిన మూర్ఖుడు జగన్. ఒక మాజీ ముఖ్యమంత్రితో వ్యవహరించే తీరు ఇలాగేనా?” అంటూ రేణుకా చౌదరి మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version