తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బి అలర్ట్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 13వ తేదీ నుంచి అంటే ఎల్లుండి నుంచే పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఏలూరు నుంచి ఈనెల 30వ తేదీ వరకు బ్రిడ్జి కోర్స్ నిర్వహించనుండగా.. జూలై ఒకటో తేదీ నుంచి విద్యార్థులకు రెగ్యులర్ పాఠాలు చెప్పాలని తెలంగాణ విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది.
బ్రిడ్జి కోర్సు కింద మూడో తరగతి నుంచి 10వ తరగతి వరకు నాలుగు స్థాయి గా విభజించి గణితము, సైన్స్, ఇంగ్లీషు మరియు సోషల్ పాఠ్యపుస్తకాలను ఆధారంగా దీన్ని రూపొందించారు. ఈ క్లాసులు ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు. ఇక ఇది ఇలా ఉండగా… పాఠశాలలు పునః ప్రారంభం చేస్తే.. కరోనా కేసుల పరిస్థితి ఎంటనే దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.