రేవంత్ ఎఫెక్ట్: కేటీఆర్ డ్యామేజ్ కంట్రోల్?

-

పైకి ఏదో తమకు ఎక్కువ బలం ఉందని, ప్రతిపక్షలకు అంత సీన్ లేదని టీఆర్ఎస్ పార్టీ భ్రమల్లో ఉంది..కానీ వాస్తవ పరిస్తితులు అర్ధం అయ్యేసరికి కారు పార్టీకి చుక్కలు కనబడుతున్నట్లు ఉన్నాయి. ప్రతిపక్షాలు తమని ఏమి చేయలేవని పైకి కవర్ చేసుకుంటున్నా…లోపల మాత్రం కారులో సెగలు రేగుతున్నాయని చెప్పొచ్చు. అలాగే కారులో వచ్చే సెగలని తగ్గించడానికి మంత్రి కేటీఆర్ నానా ఇబ్బందులు పడుతున్నారని కూడా అర్ధమవుతుంది.

ఇటీవల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మరింత దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే..టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి ఆ పార్టీలో ఉన్న నేతలని లాగేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు వల్ల చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నారు…ఈ క్రమంలో వారు టీఆర్ఎస్ పార్టీని వీడటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పలువురు పార్టీ కూడా వీడారు. ఇంకా మరికొందరు పార్టీ వదలడానికి సిద్ధమయ్యారు.

ఇక ఇటీవల టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పూర్తిగా టీఆర్ఎస్ ని టార్గెట్ చేసుకున్నారు…ఆ పార్టీలో ఉన్న అసంతృప్త నేతలతో టచ్ లోకి వెళ్లారు..అలాగే వారిని కాంగ్రెస్ లోకి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురుని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారు. ఇంకా కొంతమందిని లాగడానికి చూస్తున్నారు. అయితే రేవంత్ ఎవరినైతే టార్గెట్ చేశారో వారిని కేటీఆర్ బుజ్జగించే పనిలో పడ్డారు. ఇప్పటికే తుమ్మల, పొంగులేటి, కడియం, జూపల్లి లాంటి నేతలతో కాంటాక్ట్ లో ఉంటున్నారు.

అలాగే తాజాగా రేవంత్…ఉమ్మడి రంగారెడ్డిలో బలంగా ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీని కాంగ్రెస్ లోకి లాగే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం మొదలైంది. పట్నం భార్య, వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా, అలాగే పట్నం సోదరుడు, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకు రావడానికి ట్రై చేస్తున్నారని, వారిని మూడు టిక్కెట్ల ఆఫర్ కూడా ఇచ్చారని తెలిసింది.

దీంతో కేటీఆర్ అలెర్ట్ అయ్యారు…పైగా ఈ మధ్య పట్నం భార్య సునీతా కారుపై సొంత పార్టీ వాళ్లే దాడి చేశారు. ఈ క్రమంలో పట్నం ఫ్యామిలీ టీఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తితో ఉంది..ఇక కేటీఆర్ ఎంటర్ అయ్యి…పట్నం ఫ్యామిలీని సముదాయించి..రంగారెడ్డి లోని ఇతర టీఆర్ఎస్ నేతలకు క్లాస్ తీసుకుని, ఆడపడుచుని అవమానించకూడదు అని నాలుగు నీతి సూత్రాలు చెప్పారు. అలాగే పట్నం ఫ్యామిలీకి పార్టీలో సముచిత స్థానం ఉంటుదని అన్నారు. దీంతో పట్నం ఫ్యామిలీ తాము పార్టీని వీడేది లేదని, టీఆర్ఎస్ లోనే ఉంటామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా కేటీఆర్ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు. మరి ఆయన ఎంతవరకు కంట్రోల్ చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news