ఈటల రాజేందర్ ని రేవంత్ రెడ్డి టార్గెట్ చేయట్లేదా?

-

తెలంగాణలో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. మొన్నటివరకు కేసీఆర్ కుడిభుజంగా ఉన్న ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌ని వీడి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. అలాగే మళ్ళీ హుజూరాబాద్ బరిలో నిలబడటానికి ఈటల సిద్ధమైపోయారు. ఇలా ఓ వైపు రాజకీయం జరుగుతుంటే, మరో వైపు టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడం మరో సంచలమైంది.

ఈటల రాజేందర్ | రేవంత్ రెడ్డి
ఈటల రాజేందర్ | రేవంత్ రెడ్డి

ఆయన పీసీసీ పీఠం దక్కగానే దూకుడుగా ఉండటం మొదలుపెట్టారు. మొదట పార్టీలో సీనియర్లని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కేసీఆర్, బీజేపీలపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ దగ్గర నుంచి అధికారాన్ని గుంజుకోవడమే తన లక్ష్యమని రేవంత్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే రేవంత్‌కు హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు ఒక సవాల్‌గా మారుతుందని విశ్లేషణలు వస్తున్నాయి.

అయితే ఈ విషయంలో రేవంత్ పెద్దగా సీరియస్‌గా లేరని తెలుస్తోంది. హుజూరాబాద్ ఉప పోరు తన సామర్ధ్యానికి పరీక్ష కాదని తేల్చి చెప్పేస్తున్నారు. ఈ ఉపపోరు ప్రత్యేక పరిస్తితుల్లో జరుగుతుందని, ఇక్కడ కాంగ్రెస్ గెలవడం వల్ల కేసీఆర్ ఏమి సీఎం పీఠం నుంచి దిగిపోరని, అటు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏమి దిగిపోదని మాట్లాడుతున్నారు. దీని వల్ల ఇప్పటికిప్పుడు జరిగేది ఏమి లేదని, కాబట్టి ఈ ఉపపోరు వల్ల కాంగ్రెస్‌కు జరిగే నష్టం ఏమి లేదని అంటున్నారు.

కానీ హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంక్ ఉందని, అక్కడ తాము సత్తా చాటడమే లక్ష్యంగా పనిచేస్తామని, కానీ దీంతోనే కొంపలు మునిగిపోవని అంటున్నారు. అంటే ఈటల రాజేందర్‌ని రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి రాజకీయం చేసే పరిస్తితులు కనిపించడం లేదు. కాకపోతే ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ని ఓడించాలని రేవంత్ బాగానే ప్రయత్నించేలా కనిపిస్తోంది. మరి చూడాలి హుజూరాబాద్ బరిలో రేవంత్ ఏం చేస్తారో?

Read more RELATED
Recommended to you

Latest news