దుబ్బాక సీన్ హుజూరాబాద్ లో రిపీట్ అవుతుందా?

-

ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు హుజూరాబాద్ ఉపఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, హుజూరాబాద్ బరిలో మళ్ళీ నిలబడుతున్నారు. హుజూరాబాద్‌లో గెలిచి తన సత్తా ఏంటో కేసీఆర్‌కు చూపించాలని అనుకుంటున్నారు. అటు ఈటలకు చెక్ పెట్టి గులాబీ జెండా ఎగరవేయాలని టీఆర్ఎస్ వర్గాలు చూస్తున్నాయి.

 హుజూరాబాద్‌

కానీ దుబ్బాకలో ఫలితమే హుజూరాబాద్‌లో రిపీట్ అవుతుందని కమలం పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్తితి అలా ఉందా? అంటే కాస్త అవుననే చెప్పొచ్చు. దుబ్బాక టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమే. అక్కడ ఎమ్మెల్యే చనిపోవడంతో ఉపఎన్నిక వచ్చింది. ఆ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరుపున సోలిపేట భార్య సుజాత నిలబడింది. కాంగ్రెస్ తరుపున చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు. అలాగే బీజేపీ తరుపున రఘునందన్ రావు బరిలో దిగారు.

దుబ్బాకలో బీజేపీకి పెద్ద బలం ఏమి లేదు. కానీ రఘునందన్‌కు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ వల్ల దుబ్బాకలో బీజేపీ చివరి రౌండ్‌లో గెలిచింది. దాదాపు వెయ్యి ఓట్ల మెజారిటీతో రఘునందన్ గెలిచారు. దుబ్బాక సీనే హుజూరాబాద్‌లో కనిపిస్తోందని చెప్పొచ్చు. టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌ కు సొంత బలం ఎక్కువే. ఇక్కడ బీజేపీకి కూడా పెద్ద బలంలేదు. కేవలం ఈటల ఇమేజ్ మీద ఆధారపడే ఎన్నిక జరగనుంది.

అటు టీఆర్ఎస్‌కు ఇంకా అభ్యర్ధి డిసైడ్ అవ్వలేదు. కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఈయనకు కూడా కాస్త పట్టు ఉంది. కాకపోతే ఇప్పుడు ఈటల వర్సెస్ టీఆర్ఎస్ అనేలాగా పోరు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ సైడ్ అవుతుంది. అలాగే బీజేపీ బలం కంటే తన సొంతం బలాన్ని నమ్ముకునే ఈటల పోటీ చేస్తున్నారు. ఇక అధికార బలంతో టీఆర్ఎస్ బరిలో ఉంటుంది. ఏదేమైనా గానీ కాస్త దుబ్బాక మాదిరిగానే హుజూరాబాద్ పోరు కూడా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మరి చివరిగా హుజూరాబాద్‌లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news