కెసిఆర్, కేటీఆర్ లు ఆమరణ నిరాహార దీక్ష చేయండి..రక్షణగా ఉంటాం : రేవంత్

-

కాంగ్రెస్‌ కొత్త పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంచి దూకుడుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వరుస ప్రెస్‌ మీట్లతో కేసీఆర్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. అయితే.. తాజాగా జలవివాదంపై మాట్లాడిన రేవంత్‌ రెడ్డి… సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ లు ఇద్దరు జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేయాలని.. అలా చేస్తే.. మేమే మీకు రక్షణగా ఉంటామని ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా… కృష్ణా నదిలో వాట కోసం దీక్ష చేయాలని… నేను మా పార్టీ అధిష్ఠానంతో మాట్లాడతానని పేర్కొన్నారు. కోర్టులో వేసిన పిటిషన్ ఎందుకు వెనక్కి తెచ్చుకున్నావని కేసీఆర్‌ పై ఫైర్‌ అయిన రేవంత్‌… కేంద్రం తో కొట్లాడకుండా .. వివాదం ఎందుకు సృష్టిస్తున్నావని నిలదీశారు.

దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటి..? అని ప్రశ్నించారు. నదీ జలాల్లో నిప్పులు రాజేసి… ఓట్లు కొల్లగొట్టే దుర్బుద్ధి తో కృష్ణా నదిపై ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టారని… కృష్ణా నదిపై ప్రాజెక్టులు వివాదం అవ్వడానికి కారణం కెసిఆరేనని ఆరోపణలు చేశారు. తెలంగాణ వచ్చిన మూడేళ్లలో కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే పంచాయితీ ఉండేది కాదని..కృష్ణా నది నీటి పంచాయతీ… కెసిఆర్ పంచాయితీ… షర్మిల పార్టీ ఒకదానికి ఒకటి సంబంధం ఉందని పేర్కొన్నారు.

జగన్ కుటుంబ పెద్దగానే కెసిఆర్ నీ చూడాలని.. ప్రాజెక్టు ప్రారంభం కూడా జగన్ తోనే కెసిఆర్ చేయించాడని ఆరోపించారు. లేని వివాదాలను కెసిఆర్ సృష్టిస్తున్నారని.. రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచి లబ్ది పొందాలని చూస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news