రావిరాలలో రేవంత్ రణభేరి..హాజరయ్యే నేతల పై ఆసక్తికర చర్చ

-

రైతు సమస్యలపై మొదలైన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్ర నేటితో ముగుస్తోంది. పదిరోజుల క్రితం అచ్చంపేట నుంచి ప్రారంభించిన పాదయాత్ర.. హైదరాబాద్ శివారుకు చేరుకుంది. రైతు చట్టాలు వ్యతిరేకిస్తూ చేస్తున్న యాత్ర ముగింపు సందర్భంగా… రైతు రణభేరి పేరుతో భారీ సభ ఏర్పాటు చేశారు రేవంత్. రేవంత్ యాత్రకు అధిష్టానం అనుమతి లేదంటున్న సీనియర్లు, రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ రావిరాలలో రైతు రణభేరి సభలో పాల్గొంటారా లేదా అన్నది ఆసక్తి రేపుతుంది.


కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర హైదరాబాద్ చేరుకుంది.పాదయాత్ర ముగింపు సందర్భంగా రైతు రణభేరి పేరుతో నగరశివారులోని రావిరాల గ్రామంలో సభ ఏర్పాటు చేశారు. సభ ప్రాంగణానికి ఆరు కిలోమీటర్ల దూరం నుండి ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభం అవుతుంది. ట్రాక్టర్ల ర్యాలీతో రేవంత్ రెడ్డి సభ ప్రాంగణం కి చేరుకుంటారు. అచ్చంపేటలో ప్రారంభమై రావిరాల సభ తో ముగుస్తుంది.

ఏఐసీసీ ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కో కార్యాచరణ ఎంచుకున్నారు. రేవంత్ పాదయాత్ర ఎంచుకుని పది రోజుల పాటు నడిచారు. సరూర్ నగర్ స్టేడియం లో సభ ఏర్పాటు చేయాలని అనుకున్నారు రేవంత్. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో కోడ్ అమలులో ఉంది. ఎన్నికల నిబంధనల మేరకు సిటీలోకి అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పడంతో… రావిరాల సభతో పాదయాత్ర ముగిస్తున్నారు రేవంత్.

రేవంత్ పాదయాత్రకు పార్టీలోని రేవంత్ టీం మాత్రమే హాజరైంది. 22 జిల్లాల డీసీసీ అధ్యక్షులు సంఘీబావం తెలిపారు. ఠాగూర్ రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉన్నారనే ప్రచారం జరిగింది. వీహెచ్ లాంటి వారు ఆ విషయం బహిరంగంగానే చెప్పారు. అయితే రావిరాల సభకు ఎవరు హాజరవుతారు అన్న అంశంపై పార్టీలో కీలక చర్చ జరుగుతోంది. ఠాగూర్ హజరవుతారా కాంగ్రెస్ లోని కీలక నేతలు ఉత్తమ్,కోమటిరెడ్డి,జానా,భట్టి విక్రమార్క,జగ్గారెడ్డి వీరంతా రేవంత్ కి సంఘీభావంగా సభకు హాజరవుతారా అనే విషయంపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news