ఈ మధ్య ఎలాంటి హడావిడి లేకుండా టీఆర్ఎస్, బీజేపీలకు చెందిన నేతలు వరుసపెట్టి కాంగ్రెస్ లోకి వెళుతున్నారు..అసలు చేరికల విషయంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైలెంట్ గా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. సైలెంట్ గానే టీఆర్ఎస్, బీజేపీలకు షాక్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు రాష్ట్రంలో రాజకీయ యుద్ధం పూర్తిగా టీఆర్ఎస్, బీజేపీల మధ్యే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వార్ లో కాంగ్రెస్ మూడో స్థానంలోనే ఉన్నట్లు అనిపిస్తోంది.
కానీ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చూస్తుంటే అలా కనిపించడం లేదు..బలమైన కేడర్, నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా గ్రౌండ్ లెవెల్ నుంచి పుంజుకునే దిశగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ రెండు సార్లు అధికారానికి దూరమైంది…ఇక ఈ సారి కూడా అధికారంలోకి రాకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్తితి దారుణంగా తయారవుతుంది..అందుకే ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే కసితో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది.
ముఖ్యంగా రేవంత్ రెడ్డి తనదైన శైలిలో రాజకీయం నడిపిస్తున్నారు..ఎక్కడ కూడా హడావిడి లేకుండా పార్టీ బలాన్ని పెంచుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇటీవల కాలంలో మరింత ఎక్కువగా వలసలని ప్రోత్సహిస్తున్నారు. అసలు బీజేపీలోకి ఎక్కువ వలసలు నడుస్తాయనుకునే…కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. నల్లాల ఓదేలు, తాటి వెంకటేశ్వర్లు, విజయా రెడ్డి, ఎర్రశేఖర్ లాంటి వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఇక తాజాగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఈయన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు..2014లో ఓడిపోయారు. ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల ముందు ఈయన కాంగ్రెస్ ని వదిలి…టీఆర్ఎస్ లో చేరారు. అక్కడ సరైన ప్రాధాన్యత దక్కక కాంగ్రెస్ లోకి తిరిగొచ్చేశారు. అయితే చేరికల విషయంలో రేవంత్ రెడ్డి సైలెంట్ గానే ముందుకెళుతున్నారు. ప్రవీణ్ పార్టీలోకి వస్తున్నట్లు పెద్దగా ప్రచారం కూడా జరగలేదు…కానీ అనూహ్యంగా పార్టీలోకి వచ్చారు. ఇక ఇలా ఎంతమంది నాయకులు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారో చూడాలి. మొత్తానికి పెద్ద లైన్ ఉన్నట్లు ఉంది..ఇంకా పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేలా ఉన్నారు.