ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

-

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రామ రెవెన్యూ సహాయకులు (VRA) సమస్యల పరిష్కారం గురించి…కేసీఆర్‌ కు లేఖ రాశారు రేవంత్‌ రెడ్డి. మీ ప్రభుత్వంలో వీఆర్ఎల బతుకులు అగమ్యగోచరంగా మారాయి. వారి అకాల మరణాలు, ఆత్మహత్యలు నిత్యకృత్యం కావడం బాధాకరం. వాళ్లతో గొడ్డు చాకిరీ చేయించుకోవడమే తప్ప, వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు.


తమ సమస్యలను పరిష్కరించావని, ఉద్యోగ భద్రత కల్పించాలని మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వీఆర్ఏలు గత 48 రోజలుగా సమ్మె చేస్తున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. అయిన మీ రాక్షస ప్రభుత్వంలో చలనం లేకపోవడం అత్యంత బాధాకరం. గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ)కు పే స్కేల్‌ఇస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా 2020, సెప్టెంబర్ 9న మీరు హామీ ఇచ్చి సరిగ్గా రెండేళ్లు దాటింది. “ఇకపై వీఆర్వోలు ఉండరు. విద్యార్హతలు కలిగిన వీఆర్‌ఏలకు పే స్కేల్‌అమలు చేస్తాం. ఉన్నత విద్యార్హతలు ఉన్న వారికి పదోన్నతులు కల్పిస్తాం. 55 ఏళ్లు నిండితే వారి పిల్లలకు వారసత్వంగా వీఆర్‌ఏలుగా అవకాశం కల్పిస్తాం…” అంటూ ఆ సందర్భంగా హామీలు గుప్పించారని పేర్కొన్నారు.

మీ హామీలను చూసి వీఆర్ఏలు ఉబ్బితబ్బిబ్బయ్యారు. జీవితాలు మారిపోతాయని ఆశపడ్డారు. పే స్కేల్‌ అమలు చేస్తే రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతనం వస్తుందని ఆశ పడ్డారు. పీఆర్సీ అమలు చేసినప్పుడల్లా జీతాలు పెరుగుతాయని భావించారు. ఇతర శాఖల్లోని ఉద్యోగుల తరహాలోనే పదోన్నతులు వస్తాయని ఆశించారు. మరీ ముఖ్యంగా ఉద్యోగానికి భద్రత ఉంటుందని భావించారు. కానీ మీరు యదావిధిగా మాటతప్పారు. ఉదారంగా హామీలు ఇవ్వడమే తప్ప, వాటిని అమలు చేసే చిత్తశుద్ధి మీకు ఎప్పుడూ లేదు. వీఆర్ఎల విషయంలో సైతం అదే ధోరణిని ప్రదర్శించారు.ముఖ్యమంత్రి మాటకే విలువ లేదని… గత్యంతరం లేని పరిస్థితుల్లో, తమ బతుకుతెరువును కాపాడుకోవాలన్న ఆందోళనతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 వేల మంది వీఆర్‌ఏలు సమ్మె బాట పట్టారు. సమ్మెకు దిగి శనివారం నాటికి 48 రోజులు పూర్తయింది. వీఆర్‌ఏలు సమ్మెకు వెళ్లడంతో అప్పటి నుంచి ప్రభుత్వం రూ. 10,500 గౌరవ వేతనం కూడా నిలిపేసిందని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news