తెలంగాణలో టీడీపీ-టీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకోబోతుంది – రేవంత్‌ సంచలనం

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఏపీ మంత్రులు కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఏపీలో కరెంట్, నీటి సమస్యలు ఉన్నాయని, రోడ్లు బాగా లేవని మంత్రి కేటీఆర్ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. అయితే… ఈ వ్యాఖ్యలపై రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఇవాళ కేటీఆర్… ప్లీనరీ లో కెసిఆర్ మాటలు చూస్తుంటే టీడీపీ తో పొత్తు పెట్టుకుంటారెమోనని అనిపిస్తుందంటూ ఎద్దేవా చేశారు రేవంత్‌ రెడ్డి.

ప్లీనరీ లో కెసిఆర్.. ఎన్టీఆర్‌ ను స్మరించారు…కెసిఆర్ తెలంగాణలో పోత్తుల గురించి ఆలోచిస్తున్నారు కదా..? అన్నారు. తాజాగా కేటీఆర్‌ వ్యాఖ్యలకు టీడీపీ నేతలు సపోర్ట్‌ గా ఉంటున్నారని.. వారి మధ్య పొత్తు చిగురిస్తుందన్నారు. కెసిఆర్ కన్ఫ్యూజన్ లో ఉన్నారని.. రాజకీయంగా భయం..భయం గా ఉన్నారని చురకలు అంటించారు. కెసిఆర్..మోడీ..జగన్..అసద్ అంతా ఒక్కటేనని.. ఏడు పార్లమెంట్ నియోజక వర్గాల నుండే రాహుల్ సభకు ఎక్కువ జన సమీకరణ ఉంటుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news