ఒమిక్రాన్ వేరియంట్ ఓ కొత్త అమ్మాయి.. ఆర్జీవి షాకింగ్ కామెంట్స్

-

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎప్పుడూ ఏదో ఒక విషయం పై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. వార్తల్లో నిలుస్తారు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ అంశాలు, సమాజంలో జరుగుతున్న అంశాలపైనే రామ్ గోపాల్ వర్మ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. వాటి పైనే ఎక్కువగా ట్వీట్లు కూడా పెడుతుంటారు ఈ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

అయితే తాజాగా.. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న ఓమిక్రాన్ వేరియెంట్  పై ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు. ఓమిక్రాన్ కొత్త గర్ల్  అని.. డెల్టా వేరియంట్ పాత అమ్మాయి  అంటూ ట్వీట్ చేశారు వర్మ.  “పట్టణంలో ఓమిక్రాన్ కొత్త అమ్మాయి..  కానీ నిజమైన ప్రమాదం మాజీ అమ్మాయి డెల్టా.  ముంబైలో ఒక రోజులో దాదాపు 1000 డెల్టా కేసులు నమోదయ్యాయి. అసలైన ప్రమాదం డెల్టానే.  కానీ మీడియా ఓమిక్రాన్ పై ఫోకస్ చేస్తుంది” అంటూ వర్మ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news