ప్రశాంత్ నీల్-తారక్ మూవీపై RGV ఇంట్రెస్టింగ్ ట్వీట్..NTR31పై భారీ హైప్

-

శుక్రవారం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆయన నటిస్తున్న చిత్రాల అప్ డేట్స్ ఇచ్చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ చేయబోయే NTR30 ఫిల్మ్ నుంచి వీడియో రిలీజ్ చేశారు. సదరు వీడియోలో తారక్ చాలా వయ్ లెంట్ గా కనిపించాడు. సముద్రంలో రెండు కత్తులు పట్టుకుని నిలబడి చెప్పే డైలాగ్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే తారక్ తో తన నెక్స్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. KGF ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. NTR31 సినిమా ఏ రేంజ్ లో ఉండబోతున్నదనేది ఆ పోస్టర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. కాగా, ఈ మూవీ పోస్టర్ చూసిన వివాదాస్పద దర్శకుడు RGV అలియాస్ రామ్ గోపాల్ వర్మ్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

తారక్ చేయబోయే ఈ సినిమా కోసం తాను చాలా వెయిట్ చేస్తానని, అది తన మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. వర్మ ట్వీట్ చూసి ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘సలార్’ పిక్చర్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత ప్రశాంత్..తారక్ తో సినిమా చేయనున్నారు. పోస్టర్ లో తారక్ చాలా వయ్ లెంట్ గా కనిపిస్తున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ 31పై ఇప్పుడే భారీ హైప్ క్రియేట్ అయింది. RRR ఫిల్మ్ తర్వాత తారక్ చేస్తున్న చిత్రాలు పాన్ ఇండియా రిలీజెస్ గా ప్లాన్ అవుతుండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news