BREAKING : దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్‌ కు ఐదేళ్ల జైలు శిక్ష

-

దాణా కుంభకోణం కేసులో బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. దాణా కుంభకోణానికి సంబంధించిన డోరండా ట్రెజరీ కేసులో ఓర్మర్ బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అంతేకాదు.. రూ. 60 లక్షల ఫీజు కూడా చెల్లించాలని కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ప్రత్యేక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కోర్టు గత వారం ఈ కేసులో దోషులకు శిక్ష పరిమాణాన్ని ప్రకటించింది.

ఈ నేపథ్యంలోనే… దాణా కుంభకోణానికి సంబంధించిన డోరండా ట్రెజరీ కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా పేర్కొంటూ గత వారం సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. జార్ఖండ్‌ లోని డోరాండా ట్రెజరీ నుంచి రూ.139.35 కోట్లను అక్రమంగా విత్‌డ్రా చేయడంపై లాలూ ప్రసాద్ యాదవ్‌ పై కేసు నమోదైంది. లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పశువులకు మేత మరియు ఇతర అవసరాల కోసం కల్పిత ఖర్చుల కోసం వివిధ ప్రభుత్వ ఖజానాల నుండి రూ.950 కోట్ల విలువైన కుంభకోణం బయటపడింది. ఇక తాజాగా ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news