TDP అంటే తెలుగు దుష్ప్రచారాల పార్టీ – ఆర్కే రోజా

-

తెలుగు దేశం పార్టీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి ఆర్‌కే రోజా. TDP అంటే తెలుగు దుష్ప్రచారాల పార్టీ అని చురకలు అంటించారు ఆర్కే రోజా. వైఎస్‌ జగన్‌ లాంటి సీఎం ఉండటం అదృష్టం అని మహిళలు భావిస్తున్నారని… దీన్ని చూసి సహించలేక.. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

మంత్రి ఆర్‌కే రోజా

ఒక మేనిఫెస్టోతో రాజకీయం చేయాలి కానీ, మార్ఫింగ్‌ వీడియోలతో కాదు. టీడీపీ అంటే తెలుగు దుష్ప్రచారాల పార్టీ అని అందరూ అనుకొంటున్నారని ఆగ్రహించారు. ఐ టీడీపీ అంటే లోకేష్‌ నడిపించే ఓ తప్పుడు ప్రచార విభాగమని… అందులో మార్ఫింగ్‌ వీడియోలు అప్‌లోడ్‌ చేసి, ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బకొట్టాలనే కుటిలయత్నం బట్టబయలు అయిందని ఆర్కే రోజా విమర్శలు చేశారు. మార్ఫింగ్‌ వీడియోలతో టీడీపీ రాజకీయం చేస్తుండటం దుర్మార్గమన్నారు. వైఎస్సార్‌సీపీపై, ప్రభుత్వంపై బురదజల్లటానికి టీడీపీ నేతలు ఎంతగా దిగజారి పోయారో ప్రజలందరూ చూశారని సెటైర్లు పేల్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version