BigC షో రూంలో చోరీ.. బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం..

-

ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పట్టణం మెయిన్ రోడ్డులోని బిగ్‌సి సెల్ షాప్‌లో దుండగులు చోరీకి తెగబడ్డారు. గడ్డ పలుగులతో షట్టర్ తాళాలు పగలగొట్టి మరి దుండుగులు చోరీ చేశారు. దుకాణంలో విలువైన సెల్‌ఫోన్లు, నగదును అపహరించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. పట్టణ నడిబొడ్డున చోరీ జరగడంపై వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. పోలీస్ నిఘా మరింత పటిష్టం చేయాలని దుఖాణ యజమానులు, ప్రజలు కోరుతున్నారు.

ఇదిలా ఉంటే.. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండలో గల బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీపావళి ధమాకా అమ్మకాలకు తెచ్చిన బ్యాటరీ బైక్‌లు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని యజమానులు అంటున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నించారు. ఈ ప్రమాదంలో యాభై లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా.

Read more RELATED
Recommended to you

Exit mobile version