దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లను ఏపీలో అమ్ముతున్నారు – వైసీపీ ఎంపీ

-

దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లను రాష్ట్ర ప్రభుత్వ మద్యం దుకాణాలలో విక్రయించడం విడ్డురంగా ఉందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. ఒంగోలు డిఎస్పి కార్యాలయం ఎదురుగా ఉన్న ఇంట్లో ముగ్గురు మగవాళ్ళు మద్యం తాగి మరణించారని, రాష్ట్రంలో గతంలో నాణ్యమైన మద్యం విక్రయించేవారని, కానీ ఇప్పుడు నాసిరకమైన మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాసిరకం మద్యం విక్రయించడం వల్ల, ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోవలసిన పరిస్థితి నెలకొందని, కంపెనీ పేరు చెప్పి క్వార్టర్ అడిగే విధానం రాష్ట్రంలో లేదని, కేవలం మద్యం ధరల చెప్పి క్వాటర్ అడిగే విధానం మాత్రమే అమలులో ఉందని, నాసిరకం మద్యం విక్రయాయాల గురించి ప్రశ్నించినందుకు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు గారిపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని అన్నారు.
మద్యం నాణ్యతను తగ్గించి, నాలుగు రెట్ల ఆదాయం పెంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని లాక్కుంటుందని, రామోజీరావు గారు చేసిన చట్ట ఉల్లంఘనలు ఏవి లేవీ లేవని, న్యాయస్థానాలలో ఈ కేసు నిలబడదని, ఈ కేసుల ద్వారా రామోజీరావు గారు లూజ్ వెంట్రుకను కూడా రాష్ట్ర ప్రభుత్వం పీకలేదని అన్నారు. గతంలో తనని లాకప్లో చిత్రహింసలు పెట్టడానికి లుంగీలతో వచ్చిన బ్యాచ్, ఇప్పుడు రామోజీరావు గారిని ప్రశ్నించడానికి సూట్ లలో వెళ్తున్నారని, రామోజీరావు గారిని విచారిస్తున్న విధానాన్ని సాక్షి దినపత్రికలో పూస గుచ్చినట్లు రాయడం పరిశీలిస్తే సాక్షి దినపత్రిక వాడు టేబుల్ కింద నక్కి వింటున్నాడా? అనే అనుమానం కలుగుతోందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version