RRR: తెలుగులో కన్నా హిందీలో పెరిగిన రన్ టైం… అసలు కారణం అదేనా..?

-

దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న మచ్ అవెయిడ్ మూవీ ‘ ఆర్ఆర్ఆర్’. ఈనెల 25న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్యాన్ ఇండియా సినిమాగా… తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మళయాళం భాషల్లో విడుదల కాబోతోంది. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి తరువాత వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియాభట్, అజయ్ దేవ్ గన్ నటిస్తుండటంతో అందరిలో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. చారిత్రక కల్పిక కథతో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా, ఎన్టీఆర్ కొమురం భీంగా నటిస్తున్నారు.

ఇక విడుదలకు కేవలం ఒకే రోజు ఉంది. అయితే చారిత్రక కథాంశం కావడంతో సినిమా నిడివి కూడా ఎక్కువగానే ఉంది. తెలుగుతో పాటు సౌత్ లో రన్ టైం 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లుగా ఉంది. మరోవైపు హిందీలో మాత్రం రన్ టైం మరింతగా ఎక్కువగా ఉండబోతోంది. హిందీలో 3 గంటల 10 నిమిషాలు ఉండబోతోంది. 

అయితే హిందీలో రన్ టైం పెరగడానికి ప్రధానం కారణం వేరేగా ఉందని ఫిలింనగర్ లో టాక్. అజయ్ దేవ్ గన్, అలియా భట్ పాత్రలు ఉండటంతో హిందీలో రన్ టైంపెరిగినట్లు సమచారం. వీరిద్దరి కోసమే రన్ పెంచారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version