ట్రిపుల్ ఆర్ పై ఆర్జీవీ ప్రశంసలు…. తనదైన శైలిలో ట్విట్

-

దేశవ్యాప్తంగా ఎన్నో అంచానాల మధ్య మార్చి 25న విడుదలైన ‘ ఆర్ఆర్ఆర్’ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ. 200 కోట్లకుపైగా గ్రాస్ కలెక్ట్ చేసి దమ్ము చూపింది. బాహుబలి తరువాత వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీనికి తగ్గట్లుగానే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్యాన్ ఇండియా సినిమాగా విడుదలైన ట్రిపుల్ ఆర్ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మళయాళంలో కూడా మంచి కలెక్షన్లను రాబడుతోంది. 

ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు శివకార్తికేయన్, ప్రుథ్వీరాజ్ సుకుమారన్, మంచు లక్ష్మీ, సాయిధరమ్ తేజ్ వంటి వారు ప్రశంసలు కురిపించారు. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ కూడా రాజమౌళిని ప్రశంసించారు. ఇదిలా ఉంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్రిపుర్ ఆర్ సినిమాపై స్పందించారు. తనదైన రీతిలో ట్విట్ చేశారు.‘ బాహుబలి చరిత్ర, ట్రిపుల్ ఆర్ చారిత్రాత్మకం. బాక్సాఫీస్ కు మోక్షం కలిగించి వ్యక్తి రాజమౌళి’ అని ట్విట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version