ట్రిపుల్ ఆర్ కలెక్షన్ల సునామీలో కూడా సత్తా చాటుతున్న ‘ ది కాశ్మీర్ ఫైల్స్’

-

ప్రస్తుతం దేశంలో రెండు సినిమా హవా మాత్రమే కొనసాగుతోంది. ఒకటి ప్యాన్ ఇండియా సినిమాగా విడుదలైన రాజమౌళి దర్శకత్వంలోని ‘ ఆర్ఆర్ఆర్’ ఒకటి అయితే… మరొకటి వివేక్ అగ్నిహెత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ ది కాశ్మీర్ ఫైల్స్’. ఈ రెండు సినిమాలు దేనికదే ప్రత్యేకం. అయితే మార్చి 25న విడుదలైన ట్రిపుల్ ఆర్ సినిమా కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ. 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ట్రిపుల్ ఆర్ దెబ్బకు ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ కలెక్షన్లకు గండిపడుతుందని అంతా భావించారు. కానీ… ట్రిపుల్ ఆర్ కలెక్షన్ల సునామీలో కూడా సత్తా చాటుతోంది  ‘ది కాశ్మీర్ ఫైల్స్’మూడో వారం లో రూ. 231కోట్ల రాబట్టింది కాశ్మీర్ ఫైల్స్. కోవిడ్ తరువాత అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ సినిమా ‘ దికాశ్మీర్ ఫైల్స్’గా రికార్డ్ క్రియేట్ చేసింది. ట్రేడ్ అనలిస్ట్, క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఈ సోమవారం కూడా ‘ దికాశ్మీర్ ఫైల్స్’ మంచి వసూళ్లనే రాబట్టింది. గడిచిన శుక్రవారం రూ. 4.5 కోట్లు, శనివారం రూ. 7.6 కోట్ల, ఆదివారం రూ. 8.75 కోట్లు, సోమ వారం రూ. 3.10 కోట్లు మొత్తంగా రూ. 231.28 కోట్లను వసూలు చేసింది కాశ్మీర్ ఫైల్స్

1990ల్లో కాశ్మీర్ లో హిందూ పండిట్లపై జరిగిన మారణహోమం, పండిట్లపై అత్యాచారాలు, వలసలు ప్రధాన కథాంశంగా వివేక్ అగ్నిహోత్రి తీసిని ‘ ది కాశ్మీర్ ఫైల్స్’  ఇండియా వ్యాప్తంగా సెన్సెషన్ క్రియేట్ చేసింది. లో బడ్జెట్ సినిమాగా వచ్చిన ఈ మూవీ రికార్డ్ కలెక్షన్లను కొల్లగొట్టింది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి మరియు చిన్మయ్ మాండ్లేకర్ సినిమాలో సూపర్ గా యాక్ట్ చేశారు.

జీ స్టూడియోస్ మరియు తేజ్ నారాయణ్ అగర్వాల్, అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి మరియు వివేక్ రంజన్ అగ్నిహోత్రి నిర్మించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’, వివేక్ అగ్నిహోత్రి రచన మరియు దర్శకత్వం వహించి, మార్చి 11, 2022న థియేటర్లలో విడుదలైంది.

కాశ్మీర్ ఫైల్స్ అనేది కాశ్మీరీ పండిట్ కమ్యూనిటీ యొక్క కాశ్మీర్ మారణహోమం యొక్క మొదటి తరం బాధితుల వీడియో ఇంటర్వ్యూల ఆధారంగా నిజమైన కథ. ఇది కాశ్మీరీ పండిట్ల బాధ, బాధ, పోరాటం మరియు గాయం యొక్క హృదయాన్ని కదిలించే కథనం మరియు ప్రజాస్వామ్యం, మతం, రాజకీయాలు మరియు మానవత్వం గురించి కళ్ళు తెరిపించే వాస్తవాలను ప్రశ్నిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version