అంతర్జాతీయ క్రీడల్లో నిఖత్ జరీన్, ఇషాసింగ్ సత్తా చాటిన విషయం తెలిసిందే. ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్‌కు సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించారు. ఆమెతోపాటు ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన మరో తెలంగాణ క్రీడాకారిణి ఇషాసింగ్‌కు కూడా భారీ నజరానా ప్రకటించింది.
ప్రపంచ మహిళా బాక్సింగ్ పోటీల్లో నిఖత్ జరీన్, షూటింగ్ చాంపియన్‌గా నిలిచిన ఇషాసింగ్ ఇద్దరికీ చెరో రూ.2 కోట్లు నగదు బహుమతి ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. నగదుతోపాటు ఇద్దరికీ ఇంటి స్థలాలు కూడా కేటాయించనుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో స్థలం కేటాయించనున్నట్లు సమాచారం. ఈ మేరకు హైదరాబాద్ చేరుకున్న వీరిని.. మంత్రులు, క్రీడాకారులు, అభిమానులు భారీగా తరలివెళ్లారు. వీరిద్దరినీ ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం పేరుని దేశం గర్వపడేలా నిఖత్ జరీన్, ఇషాసింగ్ రికార్డు సృష్టించారని మంత్రులు తెలిపారు.