ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజు కు సైబర్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ సైబర్ నేరగాళ్లు.. రాజకీయ నాయకులను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇక తాజాగా తిరుపతి ఎంపి గురుమూర్తికి సైబర్ చీటర్ ఫోన్ కాల్ చేశాడు. సిఎంఓ కార్యాలయంలో పనిచేస్తున్నట్లు చెప్పిన అభిషేక్ అనే వ్యక్తి.. ఖాదీ పరిశ్రమ సబ్సిడీ రుణాల కింద 5కోట్లు మంజూరైనట్లు చెప్పాడు.
మంజూరైన రుణాలు కావాలంటే తన అకౌంట్ లో డబ్బులు వేయాలన్న అభిషేక్… 25 దరఖాస్తులకు ఒక్కొక్క దరఖాస్తుకు 1.5లక్షలు వేయాలని డిమాండ్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన తిరుపతి ఎంపి గురుమూర్తి… వెంటనే… సిఎంఓ కార్యాలయానికి ఫోన్ చేశాడు. ఆ పేరుతో ఎవరూ లేదని నిర్థారించుకున్న తిరుపతి ఎంపి గురుమూర్తి… అర్బన్ జిల్లా ఎస్పీకి ఎంపి పిఎ రాత పూర్వక ఫిర్యాదు ఇచ్చాడు. మెయిల్ ద్వారా తన వివరాలను ఎంపికి పంపాడు అభిషేక్. అయితే.. ఎంపీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సైబర్ చీటర్ ను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.