అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థలు ఆర్టీసీకి క్షమాపణలు చెప్పాలని…తక్షణమే యాడ్ ఆపకపోతే న్యాయ పరంగా ముందుకు వెళతామని వార్నింగ్ ఇచ్చారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ట దిగజార్చే విదంగా వ్యవరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని… అల్లు అర్జున్ , ర్యాపిడ్ సంస్థతో నాకు ఎలాంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవని తెలిపారు. సంస్థ ఇమేజ్ ను దెబ్బ తీసే విధంగా వ్యవహరించారు కాబట్టి నోటీసులు ఇచ్చామన్నారు.
తమ నోటిసులకు రిప్లై రాకపోతే న్యాయ పరంగా ముందుకు వెళతామని వెల్లడించారు. తక్షణమే అల్లు అర్జున్ , ర్యాపిడ్ సంస్థలు ఆర్టీసీ కి క్షమాపణలు చెప్పాలన్నారు. సెలబ్రెటీలు కమర్షియల్ యాడ్ లలో నటించే ముందు జాగ్రత్తగా చూసి నటించాలని… డబ్బులకు ఆశపడి ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించకూడదని పేర్కొన్నారు.
సినిమా వాళ్లకు బాధ్యత ఎక్కువగా ఉంటుందని… తమ ప్రొడక్ట్ గురించి ప్రమోషన్ చేసుకోవచ్చు కానీ ఇతర ప్రొడక్ట్ లను కించపరచకూడదని పేర్కొన్నారు. ఆర్టీసీతో ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంటుందని… తన చిన్న తనం, విద్యార్థి దశ , కాలేజి జీవితం మొత్తం ఆర్టీసీ తోనే ముడిపడి ఉందన్నారు సజ్జనార్.