US, UK, జపాన్ జెండాలను రాకెట్ నుండి తొలగించిన రష్యా.. కానీ భారతీయ జెండాను అలానే ఉంచింది..!

-

రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం జరుగుతున్న దాని గురించి తెలిసిందే. అయితే ఈ యుద్ధం యొక్క ప్రభావం అంతరిక్షం లో పడింది. పైగా చరిత్రలో మొదటిసారిగా, భూమిపై యుద్ధం యొక్క ప్రభావం అంతరిక్షంలో పడింది. అయితే ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాపై యుఎస్ఏ మరియు యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించడం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం క్రాష్‌కు దారితీస్తుందని చెప్పింది.

ఇది ఇలా ఉంటే వారు ఇప్పుడు అంతరిక్ష కార్యక్రమంలో పాల్గొనే దేశాల జెండాలన్నింటినీ వారు ప్రయోగించే రాకెట్ నుండి తొలగించడం జరిగింది. అయితే ఇండియా జెండాని తప్ప తక్కినవన్నీ తొలగించారు. శుక్రవారం నాడు రష్యన్ అంతరిక్ష సంస్థ ROSCOSMOS చీఫ్ డిమిత్రి రోగోజిన్ బైకోనూర్ లాంచ్ ప్యాడ్‌లోని కార్మికులు USA, జపాన్ మరియు UK జెండాలను కప్పి ఉంచుతున్న వీడియోను పోస్ట్ చేయడం జరిగింది.

కానీ భారతదేశ జెండా మాత్రం అలానే వుంది. వీడియోను పోస్ట్ చేస్తూ, రోగోజిన్ ఇలా అన్నారు. మన జెండా బాగా కనపడాలని అందుకే కొన్ని దేశాల జెండాలు లేకుండా చేసారు. ఆ జెండాలను కనపడకుండా వాటిని పూర్తిగా కప్పి ఉంచారు. సోయుజ్ రాకెట్స్ ని 36 ఉపగ్రహాలను వివిధ దేశాల నుండి తీసుకెళ్తోంది. వన్ వెబ్ ప్రాజెక్టు కింద ఇంటర్నెట్ కనెక్టివిటీ ని అందిస్తోంది.

ఈ ప్రాజెక్ట్ 648 సాటిలైట్స్ ని ఆర్బిట్ కింద లాంచ్ చేయనుంది మరియు 428 ఇప్పటికే లాంచ్ అయ్యాయి. ఇవన్నీ కూడా దీని ద్వారానే జరిగింది. ఈ ప్రాజెక్ట్ కి భారతీ ఎయిర్టెల్ గ్రూప్ మరియు UK ప్రభుత్వం యజమానులు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. రష్యా స్పేస్ ఏజెన్సీ ఏమందంటే అంతరిక్ష సంస్థ ప్రయోగానికి ముందుకు వెళ్తున్నట్లు చెప్పింది.

మార్చి 5 న జరగాల్సిన లాంచ్ కోసం లాంచ్ పాడ్ లో రాకెట్ ను ఇన్స్టాల్ చేస్తున్నామని ట్వీట్ చేసింది. అయితే ఏజెన్సీ నిర్ణయాన్ని మార్చుకుంది ప్రస్తుత పరిస్థితికి రాకెట్ ప్రయోగం అనేది ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు రష్యాపై యుకె విధించిన ఆంక్షల కారణంగా ఉపగ్రహాలను మోసుకెళ్లే రాకెట్ ని ఉపయోగించడానికి ROSCOSMOS నిరాకరించింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version