ఉక్రెయిన్ క్రైసిస్: భారతీయులను తరలించేందుకు రొమేనియా చేరుకున్న ఏయిరిండియా ప్రత్యేక విమానం

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులు భయంభయంగా బతుకుతున్నారు. దీంతో భారతీయులను ఎలాగైనా.. స్వదేశానికి తీసుకువచ్చేందుకు విదేశాంగ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సరిహద్దు దేశాల ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటోంది. ఉక్రెయిన్ కు సరిహద్దుల్లో ఉన్న రోమేనియా, పోలాండ్, హంగేరి దేశాల నుంచి భారతీయులను తరలించే ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అక్కడ ఉన్న ఎంబసీలతో భారత ప్రభుత్వం సమన్వయం చేసుకుంటుంది. 

తాజాగా రొమేనియా బుకారెస్ట్ కు చేరుకుంది ఏరిండియా ప్రత్యేక విమానం. ఈరోజు భారతీయులను స్వదేశానికి తీసుకురానుంది. 470 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో తీసుకురానున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకోనుంది. బుకారెస్ట్ నుంచి మరో విమానం సాయంత్రం 6 గంటలకు ముంబై చేరుకోనుంది. మరోవైపు ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులకు విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్ సరిహద్దులకు వెళ్ల కూడదని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు ఎంబసీతో టచ్ లో ఉండాలని సూచించారు. పశ్చిమ నగరాల్లో ఉండాలని.. అలాగే తూర్పును ఉన్న భారతీయులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని.. కదలికలను పరిమితం చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version