ఉక్రెయిన్ మేయర్ ని కిడ్నాప్ చేసిన రష్యన్ ఆర్మీ..

-

రెండు వారాలుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతూనే ఉంది. రష్యన్ ఆర్మీ ఉక్రెయిన్ ప్రధాన నగరాలను నామరూపాలు లేకుండా ధ్వంసం చేస్తున్నాయి. చెర్నివ్, ఒడిసా, మరియోపోల్, కీవ్, ఖార్కివ్ ఇలా అన్ని ప్రధాన నగరాలపై క్షిపణులతో దాడులు చేస్తోంది రష్యా ఆర్మీ. ఇప్పటికే ఖార్కీవ్, మరియోపోల్, మెలిటోపోల్ నగరాలను దాదాపుగా రష్యా స్వాధీనం చేసుకుంది. కీవ్ ను కూడా కొద్ది గంటల్లో స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే శుక్రవారం మెలిటోపోల్ నగర మేయర్ ఇవాన్ ఫెదరోవ్ ని కిడ్నాప్ చేసింది రష్యన్ ఆర్మీ. రష్యా సేలను బలవంతంగా మేయర్ ని అదుపలోకి తీసుకున్నారు. మేయర్ ని కిడ్నాప్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారు. రష్యా బలగాలు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని.. రష్యా ఐసిస్ ఉగ్రవాదుల్లా దురాక్రమణకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మెలిటోపోల్ నగర మేయర్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తోంది అమెరికా.. పాశ్చాత్య దేశాల నుంచి రష్యా, దాని మిత్రదేశం బెలారస్ కు లగ్జరీ గూడ్స్ ఎగుమతుల్ని నిలిపివేసింది. ఇదే విధంగా రష్యా నుంచి మధ్యం, సీ ఫుడ్స్, డైమండ్స్ దిగుమతుల్ని నిలిపివేసేలా ఆంక్షలు విధించింది.

మరోవైపు నాటో యుద్ధంలోకి ఎంటర్ అయితే.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version