ట్విట్టర్, ఫేస్ బుక్, బీబీసీ, యాప్ స్టోర్లపై రష్యా బ్యాన్

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం పదో రోజు కూడా భీకరంగా సాగుతోంది. రష్యా సేనలు ఉక్రెయిన్ నగరాలను నామ రూపాలు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఖర్కీవ్, కీవ్ నగరాలపై రష్య మిస్సైల్ స్ట్రైక్స్ చేస్తోంది. ఈ యుద్ధం ఇలా ఉంటే… ప్రపంచదేశాలు, రష్యాకు మధ్య ఆర్థిక యుద్ధం తీవ్రస్థాయికి చేరకుంటోంది. ఇప్పటికే అమెరికాతో పాటు జర్మనీ, యూకే, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో పాటు మరికొన్ని యూరోపియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఇప్పటికే తమ గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలను నిషేధించాయి. రష్యన్ స్టేట్ మీడియా తన ఫ్లాట్ ఫామ్ లలో ఆదాయాన్ని ఆర్జించకుండా మెటా, గూగుల్, యూట్యూబ్ నిషేధం విధించాయి. 

ఇదిలా ఉంటే రష్యా కూడా ఏమాత్రం తగ్గడం లేదు. తనపై నిషేధం విధించిన దేశాలపై నిషేధాన్ని విధిస్తోంది. ఇప్పటికే 36 దేశాలకు సంబంధించిన విమానాలపై రష్యా నిషేధం విధించింది. తాజాగా ట్విట్టర్, ఫేస్ బుక్, బీబీసీ, యాప్ స్టోర్లపై రష్యా బ్యాన్ విధించింది. దీంతో రష్యా ప్రపంచ దేశాలతో సై అంటే సై అంటోంది. రష్యా, ఉక్రెయిన్ పై పోరుపై ఉక్రెయిన్ తో పాటు ఇతర దేశాల నుంచి వస్తున్న సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెటిజెన్లు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news