తెలంగాణ సిఎం కేసీఆర్ మెడలు వంచి.. అయిన రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని పేర్కొన్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల వెంటే ఉంటుందని తెలిపారు. అధికారంలో లేకున్నా కాంగ్రెస్ ప్రజల మధ్యలోనే ఉన్నామన్నారు. ఢిల్లీ లో తెలంగాణ ఎంపీలతో ధర్నా చేయిస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ ఎంపీలను తిరిగి ఎందుకు హైదరాబాద్ రప్పించాడని నిప్పులు చెరిగారు. టిఆర్ఎస్, బిజెపి నాయకులు ఇద్దరు దొంగలేనని ఫైర్ అయ్యారు.
ఢిల్లీ కి దండయాత్రకు పోతున్నాం అని చెప్పి కేసీఆర్ సైతం వెనక్కి ఎందుకు తిరిగాడని అగ్రహించారు. దున్నపోతు మీద వర్షం పడే చందంగా తెలంగాణ ప్రభుత్వం తయారయిందని మండిపడ్డారు. కేసీఆర్ మాట విని తెలంగాణ రైతులు వరి వేస్తే ప్రస్తుతం కొనుగోలు చేయని మాట మారుస్తున్నాడన్నారు. వరిని కొనుగోలు చేస్తామని గతంలోనే కెసిఆర్ అసెంబ్లీలో చెప్పాడని.. దీనికి సీఎం కేసీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ.