మహారాష్ట్రలో దారుణం.. సాధువులపై గ్రామస్థుల దాడి

-

మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో పండరీపురం పుణ్యక్షేత్రానికి కొందరు సాధువులు వెళ్తున్నారు. మార్గమధ్యలో మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని లవంగా గ్రామానికి చెందిన ఓ పిల్లవాడ్ని రహదారి గురించి ఆరా తీశారు సాధువులు. వారిని గమనించిన గ్రామస్థులు వారు పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాగా అనుమానించారు. అనుమానంతో వారిని పలు ప్రశ్నలు అడగ్గా.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. నలుగురు సాధువులను పిల్లలు ఎత్తుకుపోయే ముఠాగా అనుమానించి.. స్థానికులంతా కలిసి కర్రలతో దాడికి పాల్పడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. సాధువులను వెంటనే పోలీస్​స్టేషన్​కు తరలించి సమగ్ర విచారణ చేపట్టారు. ఆ తర్వాత వారు నిజమైన సాధువులేనని తేల్చారు. వీరంతా ఉత్తర్​ప్రదేశ్​ మథురలోని శ్రీ పంచనం జునా అఖాడాకు చెందిన సాధువులని పోలీసులు వెల్లడించారు.

తమను గ్రామస్థులు అపార్థం చేసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులకు సాధువులు తెలిపారు. తాము కూడా అవగాహన లోపం వల్లే దాడి చేశామని గ్రామ ప్రజలు చెప్పారు. అయితే ఇరువర్గాల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version