మరోసారి టీడీపీపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సందర్భంగా గడచిన రెండు రోజులుగా అక్కడ జరుగుతున్న ఘర్షణలపై సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం స్పందించారు.
కుప్పంలో టీడీపీ కార్యకర్తలు బరితెగించారని ఆయన మండిపడ్డారు. విధ్వంసకర ఘటనకు టీడీపీ తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం జగన్ పాలనలో కుప్పం ప్రజలు అభివృద్ధిని చూశారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ కకావికలమైందన్నారు.
కుప్పం ప్రజల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు సేవ చేస్తే ప్రజలు ఆయన గురించి ఆలోచిస్తారని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేశారని సజ్జల ఆరోపించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ముందు నుంచే ఉన్న వైసీపీ జెండాలను టీడీపీ శ్రేణులు తొలగించాయన్న సజ్జల… మా చంద్రబాబు వస్తుంటే వైసీపీ జెండాలు పెడతారా? అంటూ దాడులకు దిగారని ఆరోపించారు. ఈ దాడులకు చంద్రబాబే ప్రథమ ముద్దాయి అని ఆయన అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.