సాక్షి ఎఫెక్ట్ : ఆ ఆంధ్రా ఎమ్మెల్యే తెలంగాణ‌కు సాయం వావ్ వావ్

-

పేరుకు ఆయ‌న ఆంధ్రా ఎమ్మెల్యే
అయితే.. మ‌నిషి హృద‌య భాష‌ను అర్థం చేసుకోవ‌డం
ఓ ప‌ద్ధ‌తి.ఆ క్ర‌మంలోఅందించిన సాయం ఇంకా గొప్ప‌ది
ఆ క‌థ‌నం ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో..

సాయానికి హద్దులు,సరిహద్దుల ఏమీ ఉండవు.సాయం చేసే మనసు ఉండాలే కానీ.. తన, ప‌ర అనే భేదాలు లేకుండా చేయవ చ్చు..ఇదే విష‌యం మరోసారి నిరూపితం అయింది. సరిహద్దులు గీసుకుని విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలు అంతా ఒక్కటే అని మరోసారి నిరూపించారు ఆ ఆంధ్ర ఎమ్మెల్యే. ఇంతకీ ఆయన ఎవరో కాదు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఎక్కడో తెలంగాణలో ఓ వృద్ధ జంట కష్టపడుతుందని అనుకోలేదు.. తన వంతు సాయం చేశారు. సేవకూ, సహాయానికీ ఎలాంటి ప్రాంతీయ బేధాలు ఉండవని నిరూపించారు. ఇటీవల సాక్షి దిన‌ప‌త్రికలో ప్రచురితం అయిన ఓ కథనం ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డిని క‌దిలించింది.

నిర్మల్ జిల్లాలోని ఓ వృద్ధ దంపతులు..దివ్యాంగులైన తమ ఇద్దరు కొడుకులనూ వీపుపై ఎక్కించుకుని వెళ్తున్న ఫొటో ‘ గడ్డాల నాడు మా బిడ్డలే’ శీర్షికతో సాక్షి మెయిన్ పేజీలో ప్రచురితం అయింది. నిర్మల్ జిల్లా,లోకేశ్వరం మండలం,ధర్మోరా గ్రామానికి చెందిన గంగన్న- లక్ష్మీ దంపతులకు నలుగురు కుమారులు. ఇందులో ఇద్దరు కుమారులు పుట్టుకతోనే దివ్యాంగులు. దీంతో ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ ఆ ఇద్దరు కుమారులను తమ వీపుపై మోస్తూనే ఇటీవల నిర్వహించిన తెలంగాణ దివ్యాంగుల ప్రత్యేక శిబిరానికి తీసుకువచ్చారు.

అత్యంత ద‌యనీయమ‌యిన స్థితిలో ఉన్న వీరిని చూసి,సంబంధించిన దృశ్యాన్ని సాక్షి క్లిక్ అనిపించింది. ఈ ఫొటో సాక్షి మెయిన్ పేజీలో రావడంతో.. మంగళ గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించి.. ఆ కుటుంబానికి రూ.50 వేలు పంపించారు.  ఈ డబ్బును అందించాలని స్థానిక సాక్షి యూనిట్ కు దిశా నిర్దేశం చేశారు. త్వరలోనే గంగన్న- లక్ష్మీ కుటుంబానికి ఆర్థిక చేయూత‌ను ఎమ్మెల్యే త‌ర‌ఫున సాక్షి యూనిట్ స‌భ్యులు (నిర్మ‌ల్‌) అందించ‌నున్నారు.

– మ‌న లోకం ప్ర‌త్యేకం

ఇన్ పుట్ సోర్స్ : సాక్షి ఫ్యామిలీ

Read more RELATED
Recommended to you

Exit mobile version