ఉప్పును దొంగలించకూడదు..ఎందుకో తెలుసా?

-

హిందూ సంప్రాదాయల ప్రకారం కొన్ని నియమాలను తప్పక పాటించాలి..కొన్ని వారాల్లొ మాత్రమే కొన్ని పనులు చెయ్యాలి..రాత్రి వేళల్లో కొన్నింటిని ఎవ్వరికీ ఇవ్వకూడదని చెప్తుంటారు..మంగళవారం, శుక్రవారం ఎవరికీ ఏది దానం చెయ్యకూడదు ఇలాంటివి ఉంటాయి. అందుకే వాటిని భారతీయులు తప్పక పాటిస్తారు..

అలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న లక్ష్మీ దేవి వేరే వాళ్ల ఇంటికి వెళ్లిపోతుందని మన పెద్దల నమ్మకం. అయితే ఇందులో ఒకటే ఉప్పును దొంగిలించడం. ఉప్పను అస్సలే దొంగిలించకూడదని మన పురాణాలు చెబుతున్నాయి. ఉప్పును దొంగిలిస్తే అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని కూడా అందులో ఉంది. అంతే కాదండోయ్ ఉప్పును దొంగిలించడమే కాదు, కాళ్ళతో తొక్కరాదని… అలాగే చేబదులు కూడా తీసుకో రాదని అంటారు.
కనీసం ఉప్పును చేతికి కూడా ఇవ్వకూడదని పెద్దలు చెబుతారు.ఎందుకంటే ఉప్పు శనీశ్వరుని ప్రతి రూపము. పూర్వం ఉప్పు అంతగా దొరికేది కాదు. ఎంతో కష్టం మీద సంపాదించిన ఉప్పును రక్షించు కోవటానికి శనీశ్వరుని అంశగానూ, యమ ధర్మ రాజు ప్రతిరూపం గానూ చెప్పే వారు. అలా చెప్పటం వల్ల ఆ రోజులలో ఉప్పును చేబదులు అడిగేవారు కాదు.

దొంగిలించే వారు. కూడా కాదు. కానీ ప్రస్తుతం ఉప్పు చాలా తేలికగానే దొరుకుతుంది. కానీ సాయం కాల సమయాల్లో మన ఇంట్లో ఉప్పు అయిపోతే దుకాణాల్లో అమ్మరు. అలాగే ఎవరూ చేబదులు కూడా ఇవ్వరు. రోజులు గడుస్తున్నా మనం మాత్రం మన నియమ, నిబంధనలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాము..ఇది మన పెద్దలు మనకు నేర్పిన సాంప్రదాయం..ఇకపోతే పసుపు, నూనెలను కూడా రాత్రి వేళల్లో ఎవరూ అమ్మరు..బదులుకు కూడా ఇవ్వరు.

Read more RELATED
Recommended to you

Latest news