నాగ చైత‌న్య‌కు బిగ్ షాక్‌..విడాకుల‌పై స‌మంత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

-

టాలీవుడ్ హీరోయిన స‌మంత గురించి తెలుగు రాష్ట్రల‌లో తెలియ‌ని వారుండ‌రు. అటు స‌మంత‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మాట‌ల్లో చెప్ప లేనిది. అయితే.. అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత‌ విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌ట‌న రావ‌డంతో… ఆమెపై కాస్త వ్య‌తిరేకత కూడా వ‌చ్చింది. అంతేకాదు.. స‌మంత‌పై ఇష్ట‌మొచ్చిన‌ట్లు కామెంట్లు కూడా చేశారు నెటిజ‌న్లు.

అయితే.. ఆ కామెంట్ల‌పై ఇప్ప‌టికే చాలా సార్లు స‌మంత కౌంట‌ర్ ఇచ్చింది. ఇది ఇలా ఉండ‌గా.. తాజాగా నాగ‌చైత‌న్య కు షాకిచ్చేలా కామెంట్స్ చేసింది హీరోయిన్ స‌మంత‌. మేమిద్దరం విడిపోవ‌డం పై చాలా మంది చాలా ర‌కాలు మాట్లాడుతున్నారు. రాసుకుంటున్నారు. ఆ మొత్తం వ్య‌వ‌హారం పైనే అభి ప్రాయాన్ని ఇప్ప‌టికే చెప్పేశాను. కాబ‌ట్టి… ఇప్పుడు మ‌ళ్లీ మ‌ళ్లీ ఆ విడాకులు విష‌యం పై అస్స‌లు స్పందించాల్సిన అవ‌స‌రం లేద‌ని నేను అనుకుంటున్నాను. అంటూ చైతూ కు షాక్ ఇచ్చేలా మాట్లాడింది స‌మంత‌. అయితే.. స‌మంత చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version