టాపిక్ ట్రాఫిక్ : అందాల న‌దికి రాయున‌ది.. స‌మంత @12

-

ఏం అన్నావు ఏం విన్నాను క‌న్నుల్లో పొంగే భాష నువ్వు..అని అన్నారామె! ఆ పాట ఇప్ప‌టికీ మారుమోగుతోంది. క‌న్నుల్లో నిండే భాష, హృద‌య లోగిళ్ల‌లో న‌డ‌యాడే భాష..మ‌న‌సు లోగిళ్ల‌కు చేరువ‌యిన రూపం ఇంకా ఆమె, ఆమెతో పాటు ఇంకొన్ని మ‌న ద‌గ్గ‌ర చాలా చేరువుగా ఉంటాయి.అందుకే న‌టిగా ఆమె, వ్య‌క్తిగా ఆమె భ‌లే న‌చ్చుతారు కొంద‌రికి.కొంద‌రికి కొంత విభేదం ఉన్నా కూడా న‌చ్చుతారు.ఆర్టిస్టు స‌మంత అనే మాట ఆమెకు నచ్చుతుంది.గ్లామ‌ర్ డాళ్ సమంత అస్స‌లు న‌చ్చ‌ని ప‌దం.

విమెన్ ఓరియెంటేష‌న్ ను ఇష్ట‌ప‌డాలి. విమెన్ ఐడెంటిటీకి లోటు రాకుండా చూసుకోవాలి.ఆ కోవ‌లో ఆ తోవ‌లో న‌చ్చిన ప‌నులే చేయాలి. న‌చ్చ‌నివి మ‌న‌సు అంగీకారంలో లేనివి వ‌దిలేయాలి.ఆ ప‌ని స‌మంత ఎప్ప‌టిక‌ప్పుడు చేస్తోంది.ఇక‌పై చేయాలి కూడా! అప్పుడే ఆమె త‌న‌ని తాను ప్రేమిస్తూ లోకాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అన్న‌ది అలవాటు చేసుకుంటారు.

ఆ విధంగా స‌మంత త‌నని తాను, ప్రపంచంలో తానున్న స్థానాన్ని తాను ప్రేమించ‌డం మొద‌లు పెట్టి 12 ఏళ్లు.. కెరియ‌ర్ మొద‌ల‌యి 12 ఏళ్లు..ఇంకొన్ని ఏళ్లు.. ఉంటే చాలు..యాక్ష‌న్ కు క‌ట్ కు మ‌ధ్య స‌మంత.. అలా అని కాదు కానీ జీవితానికి జీవితానికి మ‌ధ్య స‌మంత అని రాయాలి.

అమ్మాయిలంతా అసూయ చెందాలి అని అనుకునేంత అందం అయితే కాదు.అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా అదే ప‌నిగా మాట్లాడుకోద‌గ్గ అందం కూడా కాదు. అయినా జెస్సీ లుక్స్ న‌చ్చాయి.ఆమె న‌టిగా న‌చ్చిన తీరాల్లో అదొక‌టి. జెర్సీలో కూడా నచ్చారు ఆమె. ఆమె న‌టిగా న‌డిచిన తీరాల్లో అదొక‌టి.. అంద‌మ‌యిన తీరం. ఆ రెండు తీరాల్లో నాగ చైత‌న్య ఉన్నారు. అదే విధంగా వారిద్ద‌రి మ‌ధ్య అంద‌రికీ తెలియ‌ని మ‌రియు తెలిసిన ప్రేమ ఉంది.

అంద‌రికీ తెలియ‌ని ప్రేమ కార‌ణంగా ఒక‌రినొక‌రు అర్థం చేసుకున్నారు.అంద‌రికీ తెలిశాక విడిపోవ‌డంతోనే ప్రేమకు మ‌రిన్ని అర్థాలు ఉన్నాయ‌ని అర్థం చేసుకున్నారు. ఆ విధంగా ఒక‌రికొక‌రు కాస్త ఎవ‌రికి ఎవ‌రు ఈ లోకంలో అన్న వేదాంత ధోర‌ణికి ద‌గ్గ‌ర‌య్యారు. అయినా న‌టిగా స‌మంత ఎప్పుడూ ఫస్ట్ బెంచ్ స్టూడెంటే! అందుకే ఆమె అంటే ఫాంలో ఉన్న ప్ర‌తి డైరెక్ట‌ర్ కూ ఇష్ట‌మే! ఆమె న‌వ్వు మాయ చేసిందా? మాట మాయ చేసిందా?

అందాల న‌ది అని రాయ‌డంలోనే ఔన్న‌త్యం ఉంది. ఆమె పూర్తి పేరు రాయ‌కుండా ఉండ‌డంలో ఎటువంటి త‌ప్పిదం లేదు కానీ ఆమె పేరు బ‌దులు అందాల న‌ది అని రాయ‌డంతో ఆమె న‌వ్వు మ‌రియు ఆమె జీవితం రెండూ మ‌రింత విస్తృతిలో ఉంటాయి. జీవితంఅంటే న‌టిగా జీవితం అని! న‌ట జీవితం 12 ఏళ్లు. కెమెరా ముందు ప‌న్నెండేళ్లు.ఓ న‌దికి పుష్క‌రం. అవునా! అలానే ఒక జీవితానికి కూడా పుష్క‌ర కాలం.. అవును! ఆమె ప్రేమించి,అభిమానించి,ఆరాధించే కెరియ‌ర్ కు 12 ఏళ్లు.ఈ సంద‌ర్భంగా ఆమె ఆనందాలు రెట్టింపు అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version