మీడియాకు అలాంటి కండిషన్ పెట్టిన సమంత..కారణం..?

-

ఇటు సౌత్ సినీ ఇండస్ట్రీలో.. అటు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది ప్రముఖ హీరోయిన్ సమంత.. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత పూర్తిస్థాయిలో రూమర్స్ కి గురైంది. అంతేకాదు ఈమెపై రకరకాల తప్పుడు ప్రచారాలు కూడా చేశారు. ఇక మళ్లీ తెలుగులో అవకాశాలను అందుకోకుండా కేవలం తమిళ్, బాలీవుడ్ సినిమాల ప్రాజెక్టులపై సంతకం చేస్తూ తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా మరొకవైపు సమంత నటించిన శాకుంతలం, యశోద చిత్రాల విడుదలకు సమయం దగ్గర పడింది. శాకుంతలం నవంబర్ 4వ తేదీన విడుదలవుతుందని దిల్ రాజు ప్రకటించారు. ఇక యశోద సినిమా కూడా దీపావళి పండుగకు విడుదల చేస్తామని అనుకున్నారు. కానీ వీఎఫ్ ఎక్స్ నిర్మాణాంతర పనులు కారణంగా ప్రకటించిన తేదీని మారుస్తూ నవంబర్ 11 కు రిలీజ్ డేట్ ఖరారు చేస్తారని అందరూ భావిస్తున్నారు.

అయితే సమంత ఈ రెండు సినిమాలను ప్రమోట్ చేయడానికి తన అజ్ఞాతం వీడాల్సి ఉంటుంది . తెలుగు మీడియం ముందుకు రావాల్సి ఉంటుంది. అయితే తనకు ఎదురయ్యే చిక్కు ప్రశ్నల గురించి అభిమానులలో ఆసక్తి నెలకొంది. సమంత ఇటీవల ఉన్నట్టుండి అమెరికాకు ఎందుకు వెళ్ళింది? స్కిన్ ట్రీట్మెంట్ నిజమా? అంటూ ఎన్నో రకాల ప్రశ్నలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు నాగచైతన్యతో బ్రేకప్ పైన కూడా కొన్ని ప్రశ్నలు తప్పవు. కానీ వీటన్నింటికీ సమాధానాలు ఇచ్చేందుకు సమంత సిద్ధంగా లేదని సమాచారం. అంతేకాదు ఇంటర్వ్యూలో వ్యక్తిగత ప్రశ్నల కంటే కెరియర్ , సినిమాలకు సంబంధించిన ప్రశ్నల పైనే ఫోకస్ పెట్టాలని, మీడియాకి కూడా కండిషన్ పెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యకాలంలో నాగచైతన్య కూడా సినిమాల విషయాల గురించి మాత్రమే అడగాలని, వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లడం తగదని కూడా మీడియాతో వారించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సమంత కూడా ఇదే పని చేస్తోంది అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version