చైతూతో విడాకుల తీసుకోవడంపై సమంత సంచలన పోస్ట్‌ !

-

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత… విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది. ఇటు వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే… తన స్నేహితులతో… విహార యాత్రలకు వెళుతోంది. అటు తన విడాకులపై నెటిజన్లు కామెంట్లు చేసే అంశంపై కూడా సమంత చాలా స్ట్రాంగ్‌ గా కౌంటర్‌ ఇస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలో తాజాగా తన విడాకులపై సంచలన పోస్టు చేసింది సమంత. సద్గురు వీడియోను షేర్‌ చేస్తూ.. విడాకుల ప్రస్తావన తెచ్చింది సామ్. ”మీరు జీవితంలో చాల భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ.. ఆ అనుభవాన్ని జీవితంలో ముందుకు వెళ్లడానికి.. మంచి మనిషిగా జీవించడానికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పిన మాటలున్నాయి.

సమంతా 2022 నుంచి తనకు జీవితంపై పెద్దగా అంచనాలేవీ లేవని.. 4 ఏళ్ల తర్వాత  తన భర్త నాగ చైతన్యతో ఇటీవల విడిపోయిన విషయాన్ని సామ్‌ ప్రస్తావించింది. అలాగే.. విడాకుల అనంతరం.. తాను సోషల్‌ మీడియాలో ఎదుర్కొంటున్న సవాళ్లపై కూడా సమంతా ప్రస్తావించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ గా మారింది.

https://instagram.com/stories/samantharuthprabhuoffl/2784411727574652011?utm_medium=share_sheet

 

Read more RELATED
Recommended to you

Exit mobile version