బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ దత్.!

-

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు గడ్డు పరిస్థితిలో వున్నాయి. ఎలాంటి సినిమా తీసినా అక్కడి ప్రేక్షకులకు నచ్చక అన్ని ప్లాప్ లుగా మారుతున్నాయి. దానికి తోడు అక్కడ హీరోల, హీరోయిన్స్ నోటి దూల కూడా సినిమా పై బాయ్ కాట్ ఉద్యమాలు జరిగేలా చేస్తున్నాయి. దీనితో బాలీవుడ్ సినిమాల తీవ్ర నష్టం జరుగుతోంది. అంతకు ముందు రికార్డు వసూళ్లు సాధించిన ఖాన్ ల సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.

అదే సమయంలో సౌత్ ఇండియన్ సినిమాలు తమ కంటెంట్ తో బాలీవుడ్ ప్రేక్షకుల అభిమానం సంపాదించు కుంటున్నాయి. రాజ మౌళి, బహుబలి 1,2,  ప్రశాంత్ నీల్ KGF సీరీస్ లు, సుకుమార్ పుష్ప సినిమాలు  వసూళ్ల వర్షం కురిపించాయి. తాజాగా రిషబ్ శెట్టి హీరోగా నటించి తెరకెక్కించిన ‘కాంతార’ కూడా సంచలనం సృష్టిస్తుండటంతో ఇప్పడు ఎక్కడ చూసినా సౌత్ సినిమాలే హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కేజీఎఫ్ 2’ లో నటించి ఆకట్టు కున్న సంజయ్  తనకు మరిన్ని సౌత్ సినిమాల్లో నటించాలని వుందని  డైరక్ట్ గా సౌత్ ఇండియన్ దర్శకుల సినిమాల లో నటించాలనే కోరిక గురించి చెప్పాడు.. అలాగే బాలీవుడ్ మేకర్స్ మసాలా, రొడ్డ కొట్టుడు సినిమాలు వదిలి కంటెంట్ వున్న సినిమాల మీద దృష్టి పెట్టాలనే అభిప్రాయం వెలబుచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version