కర్నూలు : భక్తులకు అలర్ట్..ఏప్రిల్ 4 వరకు శ్రీశైలంలో సర్వదర్శనాలు రద్దు కానున్నాయి. శ్రీశైలం లో ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 3 వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండేళ్లుగా భక్తులు ఉగాది మహోత్సవాలలో కోవిడ్ కారణంగా స్వామివారి దర్శనం చేసుకోలేకపోయారని ఈ సందర్భంగా ఈఓ లవన్న పేర్కొన్నారు.
ఈ ఏడాది ఉగాది మహోత్సవాల సంధర్బంగా వారం రోజు లు ముందు నుంచే భక్తులకు స్వామివారి స్పర్శ దర్శనం కల్పించామని ఈఓ లవన్న వెల్లడించారు.
అయితే.. భక్తుల రధ్ది కారణంగా ఏప్రిల్ 4 వరకు స్పర్శ దర్శనం తాత్కాలికంగా రద్దు చేసి అలంకార దర్శనం కల్పిస్తున్నామని ప్రకటన చేశారు. శ్రీ శైలం మల్లన్న భక్తులకు ఎటువంటి లోటు రాకుండ అన్ని ఏర్పాట్లు చేశామని.. చైర్మన్ చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. క్యూలైన్లలో బిస్కట్లు మంచినీరు పులుహోర అన్న ప్రసాదం భక్తులకు అందిస్తున్నామన్నారు.