వావ్‌.. మన హైదరాబాద్‌లో అత్యంత ఎత్తయిన భవనం

-

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఐటీ కంపెనీ లు హైదరాబాద్ లో పెట్టుబడి పెడుతూ..లక్షలాది మందికి ఉపాధి కలిపిస్తున్నాయి. దీంతో మరింతగా అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్. ముఖ్యంగా హైటెక్ సిటీ , గచ్చిబౌలి లాంటి ప్రాంతాలు అమెరికా ను తలిపించేలా తయారు అవుతున్నాయి. తాజాగా ఇప్పుడు హైదరాబాద్ నగరం మరోసారి వార్తల్లో నిలిచింది.

SAS Crown in Kokapet, Hyderabad | Reviews | Group Buy | Price

దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద బహుళ అంతస్థుల భవనం హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో నిర్మితమవుతున్నది. కోకాపేటలో ‘సాస్‌ క్రౌన్‌’ పేరిట 58 అంతస్థులు, 236 మీటర్ల ఎత్తుతో ఈ ఆకాశ హార్మ్యాన్ని కడుతున్నారు. ఇప్పటికే సుమారు 100 ఎత్తు.. 24 అంతస్థుల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 136 మీటర్ల నిర్మాణం మరో ఏడాదిలో పూర్తి కానున్నట్టు సమాచారం. ఐటీ కారిడార్‌లో ఇప్పటికే పలు భారీ భవనాలు ఏర్పాటయ్యాయి. 57, 56, 52, 50 అంతస్థులతో కూడిన భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. అయితే, 58 అంతస్థులతో సాస్ క్రౌన్ దక్షిణ భారతంలోనే అతి పెద్ద భవనంగా రికార్డు సృష్టించనుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news