టిఆర్ఎస్, బిజెపిది అత్తా కోడల్ల పంచాయతీ: రేవంత్ రెడ్డి

-

టిఆర్ఎస్, బిజెపి ఇద్దరు కలిసే ఉన్నారని వారు వేరువేరు అని ఎప్పుడూ అనుకోవద్దని అన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వారు ఏ విషయంలో కూడా విడిపోలేదని, రాష్ట్రపతి ఎన్నికల్లో టిఆర్ఎస్ సొంత అభ్యర్థిని పెడితే మోడీకి వ్యతిరేకమని అనుకోవచ్చు అని అన్నారు. అలా కాకుండా.. ఓటింగ్ కు దూరంగా ఉన్నా.. బహిష్కరణ చేసిన టిఆర్ఎస్ బిజెపికి అనుకూలమే అని అన్నారు. టిఆర్ఎస్, బిజెపిది అత్తకోడల్లా పంచాయితీ లాంటిది అని ఎద్దేవా చేశారు.

కెసిఆర్ అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచుతున్నాడని చెప్పిన బీజేపీనే మళ్లీ నాలుగు వేల కోట్ల అప్పులు తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చిందని అన్నారు. సడన్ గా టిఆర్ఎస్ పార్టీకి ఎన్టీఆర్ మీద ప్రేమ పుట్టిందని.. నేషనల్ ఎయిర్ పోర్ట్ కి ఎన్టీఆర్ పేరు పెడితే తీసేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో అడిగితే బండ బూతులు తిట్టారని.. ఎన్టీఆర్ అభిమానులు అంత తొందరగా మరిచిపోతారా? అని అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ లో వర్ధంతి, జయంతి లు కూడా అధికారికంగా చేయాల్సింది ఆపేశారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news