స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ ని తీసుకు వచ్చింది. దీనితో టూ వీలర్ లోన్లను తీసుకోవాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. తక్కువ వడ్డీకే టూ వీలర్ లోన్లను స్టేట్ బ్యాంక్ ఇవ్వనుంది. 20,000 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఈ ఆఫర్ లో భాగంగా ఎస్బీఐ కస్టమర్లు లోన్ ని పొందొచ్చు.

 

ఈ లోన్ తీసుకోవడం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఒకవేళ కనుక లక్ష రూపాయల లోన్ తీసుకుంటే నెలకు 2510 రూపాయల చొప్పున ఈ ఈఎంఐ చెల్లించాల్సి ఉండగా… లోన్ పొందేటప్పుడు డౌన్ పేమెంట్ 10,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం పే చెయ్యాల్సి వుంది. ఈ వడ్డీ రేటు 9.35 శాతం వుంది. ఈ లోన్ ని నాలుగేళ్ళ లోపు కట్టేయాలి.

ఆయితే టూ వీలర్ లోన్ తీసుకోవాలని అనుకునే వారు మార్చి 31వ తేదీలోపు తీసుకుంటే మంచిది. అప్పుడు ప్రాసెసింగ్ ఫీజులో డిస్కౌంట్ ని పొందొచ్చు. ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన కస్టమర్లు మాత్రమే. యోనో యాప్ ద్వారా ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను మీరు చూడచ్చు. బ్యాంక్ కండీషన్లను, ఇతర వివరాలను పూర్తిగా తెలుసుకుని అప్పుడు మాత్రమే లోన్ తీసుకోండి. వాహనం ఆన్ రోడ్ ధర, డీలర్ వివరాలను ఇస్తే అర్హత గురించి తెలుసుకోచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version