శనివారం ఇండియన్ రేసింగ్ లీగ్‌లో భాగంగా తొలిరోజు ఫార్ములా రేస్ కార్‌లు రయ్యూ రయ్యూ మంటూ హైదరాబాద్‌లో స్పెషల్‌గా
ఏర్పాటు చేసిన ట్రాక్‌లో దూసుకెళ్లాయి. ఈపోటీలను తెలంగాణ ఐటీశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. అయితే నేడు రెండో రోజు ఇండియన్ రేసింగ లీగ్ జరుగనుంది. ఈరోజు మూడు స్ర్పింట్ రేసులు జరగనున్నాయి. మూడు స్ర్పింట్ రేసుల్లో కలిపి ఆ రౌండ్‌లో టాపర్‌గా నిలిచిన జట్టుకు 25 పాయింట్లు లభిస్తాయి. రెండో స్థానంలోని జట్టుకు 18, మూడో స్థానంలోని టీమ్‌కు 15 పాయింట్లు లభిస్తాయి.
ఉదయం 11 గంటల నుంచి 11:30 వరకు రేసింగ్ లీగ్ ఎఫ్‌పీ3, మధ్యాహ్నం 12 గంటల నుంచి 1వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. మధ్యాహ్నం 1 నుంచి 1.15 వరకు క్వాలిఫైంగ్ లీగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.45 గంటల వరకు లీగ్ రేస్2 ఉంటుంది. సాయంత్రం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు రేస్3, అలాగే సాయంత్రం 4.30 గంటల నుంచి 4.45 గంటల వరకు ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు.